న్యూఢిల్లీ:నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధించడం మరింత ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం వెలువడే వరకు డెట్ వారంట్ పై స్టే విధించాలని కోరుతూ దోషి ముఖేష్ సింగ్ బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ ఈ నెల 14వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం వచ్చేవరకు డెత్ వారంట్‌పై నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఢిల్లీ హైకోర్టులో ముఖేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

Also read:నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్

 క్షమాభిక్ష పిటిషన్‌పై  రాష్ట్రపతి నిర్ణయం తీసుకొనే వరకు ఉరిశిక్ష తీయలేమని ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రెండున్నర ఏళ్లుగా ఎందుకు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదో చెప్పాలని  ముఖేష్ సింగ్‌ను  ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

Also read:ఉరిశిక్ష: నాడు ఆ నలుగురు, ఇప్పుడు నిర్భయ దోషులు

రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన  14 రోజుల తర్వాత ఉరి శిక్షను అమలు చేయాలనేది నిబంధన. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

also read:నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

ఈ నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 22వ తేదీన నలుగురు దోషులకు ఉరిశిక్షను విధించాల్సి ఉంది. కానీ, ముఖేష్ సింగ్ పిటిషన్ పై రాష్ట్రపతి నిర్ణయం తర్వాతే ఉరిశిక్షను విధించే అవకాశం ఉంది.