Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్

నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. 

Nirbhaya case: Mukesh Singh, One Of 4 Convicts In Nirbhaya Case, Writes To President
Author
New Delhi, First Published Jan 14, 2020, 7:05 PM IST

న్యూఢిల్లీ: నిర్భయకేసులో దోషిగా ఉన్న ముఖేష్ సింగ్ బుధవారం నాడు రాష్ట్రపతికి క్షమాబిక్ష కోరుతూ పిటిషన్ పెట్టుకొన్నాడు. ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టాడు.

Also Read వాళ్లకు ఉరి ఖాయం... అప్పుడే నా కూతురికి న్యాయం... నిర్భయ తల్లి

ముఖేష్ సింగ్, వినయ్ శర్మలు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసం ఈ క్యురేటివ్ పిటిషన్‌ను బుధవారం నాడు కొట్టేసింది.

Also read:ఉరిశిక్ష: నాడు ఆ నలుగురు, ఇప్పుడు నిర్భయ దోషులు

ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ ఠాకూర్(31)లను ఈ నెల 22వ తేదీ ఉదయం 7గంటలకు తీహార్ జైలులో ఉరితీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.

also read:నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ ల తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు.ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించి వారి పిటిషన్ ని కొట్టివేసింది.

క్యరేటివ్ పిటిషన్ కొట్టివేయడంతో ముఖేష్ సింగ్ చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి బుధవారం నాడు మెర్సీపిటిషన్ పెట్టుకొన్నాడు. ఈ పిటిషన్ పై రాష్ట్రపతి ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

2012 డిసెంబర్ 16వ తేదీన 23 ఏళ్ల నిర్భయపై వీరంతా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో  బస్సులోనే వీరంతా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. గంటల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆమె స్నేహితుడిపై కూడ దాడి చేశారు.

తీవ్రంగా గాయపడి నిర్భయ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29వ తేదీన ఆసుపత్రిలో మరణించింది.  ఈ విషయమై ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. భవిష్యత్తులో  ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  నిర్భయ చట్టాన్ని కూడ తీసుకువచ్చారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios