Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసులో ముఖేష్ సింగ్‌కు షాక్: మెర్సీ పిటిషన్ తిరస్కరణ

నిర్భయ దోషి ముఖేష్ సింగ్ మెర్సీ  పిటిషన్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించారు.

Nirbhaya case live: Delhi government rejects Mukesh Singh's mercy petition
Author
New Delhi, First Published Jan 16, 2020, 12:59 PM IST

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో  దోషి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గురువారం నాడు తిరస్కరించారు.. ఈ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖకు ఢిల్లీ ప్రభుత్వం పంపింది.

డెత్‌వారంట్‌పై స్టే విధించాలని బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టులో ముఖేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Also read:నిర్భయ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్: దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యం

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసినందున రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు కూడ డెత్ వారంట్‌పై స్టే విధించాలని ముఖేష్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు తోసిపుచ్చింది.

Also read:నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్

ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం వచ్చే వరకు ఉరి తీసే విషయంలో నిర్ణయం తీసుకోలేమని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం నాడు కోర్టుకు చెప్పింది. 

Also read:ఉరిశిక్ష: నాడు ఆ నలుగురు, ఇప్పుడు నిర్భయ దోషులు

ఈ తరుణంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖేష్ సింగ్ ముఖేష్ సింగ్  క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. కేంద్ర హోంశాఖకు ఈ ఫైల్‌ను తిరిగి పంపారు. ఈ నెల 22వ తేదీన నలుగురు దోషులను ఉరి తీసేందుకు వీలుగా డెత్ వారంట్ జారీ చేశారు.

also read:నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో ఈ నెల 22వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios