న్యూఢిల్లీ: దేశంలో పలు దఫాలు ఉరిశిక్షలు విధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకేసారి నలుగురికి ఉరిశిక్షలు విధించారు.  ఈ ఘటన తర్వాత నిర్భయ కేసులో మరోసారి నలుగురు దోషులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్షలు విధించనున్నారు.

also read:నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వినయ్ శర్మ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన  తర్వాత 1983 అక్టోబర్‌ 25వ తేదీన నలుగురిని ఉరిని తీశారు. రాజేంద్ర జక్కల్, దిలీప్ సుతార్, శాంతారామ్ జగ్తాప్, మునవర్ షాలను  ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. 1970లో 10 మందిని  హత్య చేసిన కేసులో  ఈ నలుగురిని ఉరి తీశారు. ఆ తర్వాత  నలుగురు ఉరి తీసేవారిలో నిర్భయ దోషులే అవుతారు.

Also read:రక్తపు మడుగులో చూశా.. నా గుండె రాయి అయిపోయింది... నిర్భయ తల్లి

1991 నుండి ఇప్పటివరకు దేశంలో 16 మంది దోషులు ఉరికి గురయ్యారు. ధనంజయ్ ఛటర్జీతో అనే వ్యక్తి 14 ఏళ్ల స్కూల్ బాలికను రేప్ చేసి హత్య చేసినందుకు ఉరి తీశారు.అఫ్జల్ గురు, యకూబ్ మెమెన్ లను కూడ దేశంలో ఉరి తీశారు.

AlsoRead న్యాయ విద్యార్థినిపై అత్యాచారం... కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో...

ధనుంజయ్ చటర్జీ ఒక్కడే రేప్, హత్య కేసులో మాత్రమే ఉరికి గురయ్యాడు. 2004 ఆగష్టు 14వ తేదీన ఆయనను ఉరి తీశారు. 1990 మార్చి 5వ తేదీన స్కూల్ బాలికను రేప్ చేసి హత్య చేశాడు. అయితే ఆయనను 14 ఏళ్ల తర్వాత ఉరి తీశారు.

2008 ముంబైలో ఉగ్రవాదుల దాడుల్లో మాస్టర్ మైండ్ పాకిస్తాన్‌కు చెందిన అజ్మల్ కసబ్ కు 2012 నవంబర్ 21వ తేదీన ఉరి తీశారు. పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరి తీశారు.

ముంబై దాడులు జరిగిన నాలుగు గంటల తర్వాత కసబ్ ను ఉరి తీశారు. 2013 ఫిబ్రవరి 9వ తేదీన కాశ్మీర్ టెర్రరిస్ట్ అఫ్జల్ గురు ను తీహార్ జైలులో ఉరి తీశారు. 2001 డిసెంబర్ 13న  పార్లమెంట్ పై దాడి కేసులో అప్జల్ గురును ఉరి తీశారు. పార్లమెంట్ పై దాడి చేసిన 11 ఏళ్ల తర్వాత అఫ్జల్ గురును  ఉరి తీశారు.

2015 జూలై 30న  ముంబైలో సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో  టెర్రరిస్టు యాకూబ్ మెమెన్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉరి తీశారు. 1993 లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. 22 ఏళ్ల తర్వాత యాకూబ్ మెమెన్ ను ఉరి తీశారు.