ఇటీవల జరిగిన ఎన్నికల్లో  ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం కేరళలో పర్యటించారు. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో పళ్లు, రూపాయి నాణేలతో తులాభారం వేయించుకున్నారు.

అనంతరం శ్రీకృష్ణ భగవానున్ని దర్శించుకున్నారు. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారి దర్శన నిమిత్తం ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కి రానున్నారు. ఈ మధ్యలో ఆయన మాల్దీవుల్లో జరిగే విదేశాంగ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని శ్రీలంక రాజధాని కొలంబో మీదుగా రేణిగుంట చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.