Republic Day: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జో బిడెన్ !..ఇప్పటి వరకూ వచ్చిన చీఫ్ గెస్టులు వీరే..
Republic Day 2024: ప్రతి సంవత్సరం ప్రపంచ అగ్రశ్రేణి నాయకులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తారు. ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Republic Day 2024: వచ్చే ఏడాది జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ -20 సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించినట్లు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు.
వచ్చే ఏడాది క్వాడ్ నాయకత్వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఇచ్చిన ఈ ఆహ్వానం కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి వ్యూహాత్మక, దౌత్య, వాణిజ్య , అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రపంచ నేతలకు ముఖ్య అతిథులుగా మన దేశం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారతదేశ మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటివరకు.. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ ప్రతినిధులను ఒక్కొక్కరు గరిష్టంగా 5 సార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రధాని మోడీ ఆహ్వానాన్ని జో బిడెన్ అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకల్లో పాల్గొనున్న రెండో అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ నిలుస్తారు.
ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన ముఖ్య అతిథుల జాబితా ఇదే..
1950: సుకర్నో (ఇండోనేషియా అధ్యక్షుడు)
1951: రాజా త్రిభువన్ బీర్ బిక్రమ్ షా (నేపాల్)
1952: ఆహ్వానం లేదు
1953: ఆహ్వానం లేదు
1954: జిగ్మే దోర్జీ వాంగ్‌చుక్ (భూటాన్)
1955: మాలిక్ గులాం ముహమ్మద్ (పాకిస్థాన్ గవర్నర్ జనరల్ )
1956: ఆర్. ఎ. బట్లర్ (బ్రిటన్), చీఫ్ జస్టిస్ కొటారో తనకా (జపాన్)
1957: జార్జి జుకోవ్ (సోవియట్ యూనియన్ రక్షణ మంత్రి )
1958: మార్షల్ J జియానింగ్ (చైనా)
1959: ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ (యునైటెడ్ కింగ్‌డమ్)
1960: ప్రెసిడెంట్ క్లిమెంట్ వోరోషిలోవ్ (సోవియట్ యూనియన్)
1961: క్వీన్ ఎలిజబెత్ II (యునైటెడ్ కింగ్‌డమ్)
1962: విగ్గో కాంప్‌మన్ (డెన్మార్క్ ప్రధాన మంత్రి )
1963: కింగ్ నోరోడోమ్ సిహనౌక్ (కంబోడియా)
1964: చీఫ్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ (బ్రిటన్)
1965: రాణా అబ్దుల్ హమీద్ (పాకిస్థాన్)
1966: ఆహ్వానం లేదు
1967: రాజా మహ్మద్ జహీర్ షా (ఆఫ్ఘనిస్తాన్)
1968: అలెక్సీ కోసిగిన్ (సోవియట్ యూనియన్ అధ్యక్షుడు), జోసిప్ బ్రోజ్ టిటో (యుగోస్లేవియా అధ్యక్షుడు)
1969: టోడర్ జివ్కోవ్ (బల్గేరియా ప్రధాన మంత్రి )
1970: బౌడౌయిన్ (బెల్జియన్ రాజు)
1971: జూలియస్ నైరెరే (టాంజానియా అధ్యక్షుడు)
1972: సీవోస్‌గూర్ రామ్‌గూలం (మారిషస్ ప్రధాన మంత్రి )
1973: మొబట్ సెసే సెకో (జైర్ ప్రెసిడెంట్)
1974: జోసిప్ బ్రోజ్ టిటో (యుగోస్లేవియా అధ్యక్షుడు), PM సిరిమావో బండారునాయకే (శ్రీలంక)
1975: కెన్నెత్ కౌండా (జాంబియా అధ్యక్షుడు)
1976: జాక్వెస్ చిరాక్ (ఫ్రాన్స్ ప్రధాన మంత్రి )
1977: ఎడ్వర్డ్ గిరెక్ (పోలాండ్ కార్యదర్శి )
1978: పాట్రిక్ హిల్లరీ (ఐర్లాండ్ అధ్యక్షుడు)
1979: మాల్కం ఫ్రేజర్ (ఆస్ట్రేలియా ప్రధాని)
1980: వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ (ఫ్రాన్స్ ప్రెసిడెంట్)
1981: జోస్ లోపెజ్ పోర్టిల్లో (మెక్సికో అధ్యక్షుడు)
1982: కింగ్ జువాన్ కార్లోస్ I (స్పెయిన్)
1983: రోహు షాగారి (నైజీరియా అధ్యక్షుడు)
1984: కింగ్ జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ (భూటాన్)
1985: రౌల్ అల్ఫోన్సిన్ (అర్జెంటీనా అధ్యక్షుడు)
1986: ఆండ్రియాస్ పాపాండ్రూ (గ్రీస్ ప్రధాన మంత్రి )
1987: అలాన్ గార్సియా (పెరూ అధ్యక్షుడు )
1988: JR జయవర్ధనే (శ్రీలంక అధ్యక్షుడు )
1989: న్గుయెన్ వాన్ లిన్ (వియత్నాం జనరల్ సెక్రటరీ )
1990: అనిరుద్ధ్ జుగ్నాథ్ (మారిషస్ ప్రధాని)
1991: మమ్నూన్ అబ్దుల్ గయూమ్ (మాల్దీవులు అధ్యక్షుడు)
1992: మారియో సోరెస్ (పోర్చుగల్ అధ్యక్షుడు )
1993: జాన్ మేజర్ (UK ప్రధాని)
1994: గో చోక్ టోంగ్ (సింగపూర్ ప్రధాన మంత్రి )
1995: నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా)
1996: డా.ఫెర్నాండో హెన్రిక్ కార్డోసో (బ్రెజిల్)
1997: PM బస్దేవ్ పాండే (ట్రినిడాడ్ మరియు టొబాగో)
1998: జాక్వెస్ చిరాక్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)
1999: రాజా బీరేంద్ర బీర్ బిక్రమ్ షా దేవ్ (నేపాల్)
2000: ఒలుసెగున్ ఒబాసంజో (నైజీరియా అధ్యక్షుడు)
2001: అబ్దెలాజిజ్ బౌటెఫిలా (అల్జీరియా ప్రెసిడెంట్)
2002: కస్సమ్ ఉటెమ్ (మారిషస్ అధ్యక్షుడు)
2003: మహ్మద్ ఖతామి (ఇరాన్ అధ్యక్షుడు)
2004: లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (బ్రెజిల్ అధ్యక్షుడు)
2005: కింగ్ జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ (భూటాన్)
2006: కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ అల్సౌద్ (సౌదీ అరేబియా)
2007: వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు )
2008: నికోలస్ సర్కోజీ (ఫ్రాన్స్ అధ్యక్షుడు )
2009: నూర్సుల్తాన్ నజర్బయేవ్ (కజకిస్తాన్ అధ్యక్షుడు)
2010: లీ మ్యుంగ్ బాక్ (దక్షిణ కొరియా అధ్యక్షుడు )
2011: సుసిలో బాంబాంగ్ యుధోయోనో (ఇండోనేషియా అధ్యక్షుడు )
2012: యింగ్లక్ షినవత్రా (థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి )
2013: కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ (భూటాన్)
2014: షింజో అబే (జపాన్ ప్రధాని)
2015: బరాక్ ఒబామా (US అధ్యక్షుడు)
2016: ఫ్రాంకోయిస్ హోలాండ్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు )
2017: క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
2018: థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్-ఓ-చా, మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, కంబోడియా ప్రధాని హున్ సేన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ పీఎం లీ హ్సీన్ లూంగ్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్‌నామ్. జువాన్ ఫుక్, లావోస్ ప్రధానమంత్రి థోంగ్లోన్ సిసోలిత్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్రిగో డ్యూటెర్టే.
2019: సిరిల్ రామఫోసా (దక్షిణాఫ్రికా అధ్యక్షుడు)
2020: జైర్ బోల్సోనారో (బ్రెజిల్ అధ్యక్షుడు)
2021: ముఖ్య అతిథి లేరు
2022: ముఖ్య అతిథి లేరు
2023: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్ సిసి