భవిష్యత్తులో చంద్రుడిపై నివసించవచ్చు - చంద్రయాన్ - 3 ప్రయోగం నేపథ్యంలో ప్రధాని మోడీ

చంద్రయాన్ -3 ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్లులో చంద్రుడిపై నివసించవచ్చని తెలిపారు. 

PM Modi in the wake of the Chandrayaan-3 launch which could lead to habitation on the moon in the future..ISR

చంద్రయాన్-3 ప్రయోగానికి కొన్ని గంటల ముందు భారత శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. యావత్ దేశం ఆశలు, కలలను ఈ మిషన్ మోసుకెళ్తుందని ప్రధాని అన్నారు. ‘‘చంద్రయాన్ -1 వరకు చంద్రుడు ఒక బోన్ డ్రై, భౌగోళికంగా క్రియారహిత, నివాసయోగ్యం కాని ఖగోళ వస్తువుగా మాత్రమే అని నమ్మేవారు. అయితే అది ఇప్పుడు నీరు, ఉపరితల మంచు ఉనికితో ఉన్న డైనమిక్, భౌగోళికంగా చురుకైన వస్తువుగా కనిపిస్తోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

చంద్రయాన్-3.. జూలైలోనే చంద్రుడిపైకి ఎందుకీ ప్రయాణం..? ప్రయోగాన్ని మనం లైవ్ లో చూడాలంటే ఎలా ? పూర్తి వివరాలు

భవిష్యత్తులో ఇది (చంద్రుడు) నివాసయోగ్యంగా మారే అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. భారత అంతరిక్ష రంగానికి సంబంధించి 2023 జూలై 14 ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.’ ట్వీట్ చేశారు.

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ కు చేరుకున్నారు. ఆ దేశం మోడీకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికింది. ఫ్రాన్స్ తన అత్యున్నత పౌర, సైనిక పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను ప్రధాని మోడీకి ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు.

26 కిలోల టమాటాలు చోరీ.. కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

కాగా.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లనుంది. నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి భూమికి 170 కిలోమీటర్ల దగ్గరగా, 36,500 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకార చక్రంలో 5-6 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ల్యాండర్ తో పాటు ప్రొపల్షన్ మాడ్యూల్ వేగం పుంజుకున్న తర్వాత చంద్రుని ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లే వరకు నెల రోజుల పాటు ప్రయాణించి చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించనుంది.

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే ?

మొత్తానికి ఈ వాహనం ప్రయాణానికి 40 రోజుల సమయం పడుతుంది. అనుకున్న స్థానానికి చేరుకున్న తర్వాత ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దిగడం ప్రారంభిస్తుంది. అంటే ఆగస్టు 23 లేదా 24న ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ల్యాండింగ్ అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. దాని చుట్టుపక్కల శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో నీరు ఉండే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios