26 కిలోల టమాటాలు చోరీ.. కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
టమాటాల ధరలు మండిపోతున్న తరుణంలో పలు చోట్ల వాటి దొంగతనం కూడా జరుగుతోంది. యూపీలో 26 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. దీంతో షాప్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
గతంలో చాలా విలువైన వస్తువులే చోరీకి గురయ్యేవి. అంటే బంగారం, వెండి, ఇతర విలువైన సామాగ్రిలను దొంగలు ఎత్తుకెళ్లేవారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడం జరిగేవి. అయితే ఇంట్లోని ఇతర పెద్దగా విలువలేని వస్తువులు, పండ్లు, కూరగాయాలు పోతే బాధితులు కూడా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూరగాయాలు చోరీకి గురైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఆద్యంతం ఉత్కంఠభరితం.. నేడే చంద్రయాన్ - 3 ప్రయోగం.. శ్రీహరి కోట నుంచి నింగిలోకి.. పూర్తి వివరాలివే..
దీనికి కారణం లేకపోలేదు. ఇప్పుడు కూరగాయాలు కూడా విలువైన వాటి జాబితాలో చేరిపోయాయి. అవును. మీరు విన్నది నిజమే. మార్కెట్ లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటాలు, మిరపకాయలు, ఇతర అనేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటాలు రూ.120 నుంచి 150 ధర పలుకుతోంది. దీంతో దానికి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో టమాటాలకు దొంగలు కూడా పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చి, వార్తల్లో నిలిచాయి.
ఇదెక్కడి విడ్డూరం.. 35 రోజుల కిందట గుండెపోటుతో ఎస్ఐ మృతి.. బదిలీ కావాలంటూ ఇప్పుడు ఆర్డర్స్
తాజాగా యూపీలోనూ టమాటాల దొంగతనం జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేపూర్ జిల్లాలోని ఓ మార్కెట్ ప్రాంతంలోని రాంజీ, నయీమ్ ఖాన్ లు కూరగాయాల షాప్ ను నిర్వహిస్తున్నారు. అయితే జూలై 10వ తేదీన రాత్రి ఎప్పటిలాగే వారు షాప్ ను మూసివేసి ఇంటికి వెళ్లారు. దీంతో ఇద్దరు దొంగలు రెండు దుకాణాల్లో 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిరపకాయలు, 8 కిలోల అల్లం చోరీ చేశారు.
अब ‘स्पेशल टास्क फ़ोर्स’ (एसटीएफ़) का नाम बदलकर ‘‘स्पेशल टमाटर फ़ोर्स’ कर देना चाहिए। pic.twitter.com/VIPsdU6XVh
— Akhilesh Yadav (@yadavakhilesh) July 13, 2023
మరసటి రోజు యజమానులు తమ షాప్ కు వచ్చి తెరిచి చూడగా.. పెద్ద మొత్తంలో టమోటాలు, అల్లం, మిరపకాయలు కనిపించలేదు. దీంతో బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దీనిపై దర్యాప్తు చేపట్టి కామ్తా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. కాగా.. దీనికి సంబంధించిన వార్త అక్కడి పలు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ క్లిప్పింగ్ లను యూపీ ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పేరును 'స్పెషల్ టమాటా ఫోర్స్'గా మార్చాలని అందులో సూచించారు.