మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే ?
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బోనాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు లిక్కర్ షాపుల మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు. వచ్చే ఆదివారం హైదరాబాద్ లో బోనాల పండగ నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. జూలై 16,17,18వ తేదీల్లో లిక్కర్ షాపులు తెరవకూడదని పేర్కొన్నారు.
సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో జూలై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. 17వ తేదీ సాయంత్ర 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. అలాగే సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చి, 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ కొనసాగనున్నాయి. తాము పేర్కొన్న సమయాల్లో లిక్కర్ షాపులు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషర్ ఉత్తర్వుల్లో తెలిపారు.