చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన గుజరాత్ మత్య్సకారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ దుండగుల గుంపు వారిని నిలిపివేసి దాడి చేసింది. అయితే వారు పాకిస్థాన్ నేవికి చెందిన సిబ్బంది అని మత్స్యకారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ఏడుగురు భారతీయ మత్స్యకారులను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించిన ఆరోపణలపై 20-25 మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై గుజరాత్ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖ‌లు చేశారు. అక్టోబర్ 6వ తేదీన‌ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ‘హర్సిద్ధి’ అనే భారతీయ పడవలో ఏడుగురు సిబ్బంది జాఖౌ తీరంలోని భారత జలాల్లో చేపలు పట్టే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఎఫ్ఐఆర్ పేర్కొంది.

ఒంటరి వాడినైతానని.. నితీష్ భయపడుతున్నారు.. పీకే సెటైర్లు

ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ‘PMSA BARKAT 1060’ అనే పేరు గల పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ బోటులో 20 నుంచి 25 మంది యూనిఫాం ధరించిన జవాన్లు భారత పడవపై అకారణంగా కాల్పులు జరిపారు. అనంతరం వారు పడవను ధ్వసం చేశారు. దీంతో మత్స్యకారులు నీటిలో మునిగిపోయారు. అనంతరం వారిని కిడ్నాప్ చేసి వారి ఓడలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో వారిని క‌ర్ర‌ల‌తో కొట్టారు. దీంతో వారికి గాయాలు అయ్యాయి.

సీజ్ చేసిన డబ్బుల నుంచి రూ. 10 లక్షలు చోరీ చేసిన పోలీసు అధికారి!

నిందితులు మత్స్యకారుల వీడియోను కూడా రికార్డ్ చేశారు. అనంత‌రం వారిని విడుద‌ల చేశారు. శుక్రవారం భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది త‌మ బోట్ ద్వారా మత్స్యకారులను రక్షించి గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకువచ్చార‌ని పోర్‌బందర్ ఎస్పీ రవిమోహన్ సైనీ పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

ఈ ఘ‌ట‌న‌పై జాఖౌలో మొద‌ట‌గా ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింద‌ని, త‌రువాత దానిని గుజరాత్ తీరానికి 12 నాటికల్ మైళ్లకు మించి ప్రాదేశిక అధికార పరిధిని కలిగి ఉన్న పోర్‌బందర్ జిల్లాలోని నవీబందర్ అనే పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశామ‌ని తెలిపారు. ఓ మ‌త్స్య‌కారుడి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌లు 307 (హత్యకు ప్రయత్నించడం), 365 (కిడ్నాప్), 427 (నష్టం కలిగించడం), 324 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (1) కింద నిందితులపై కేసు నమోదు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

మ‌రోసారి డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవం

ఈ ఘ‌ట‌న‌పై మ‌త్స్య‌కారుడు అందించిన వివ‌రాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇది ఎక్క‌డ జ‌రిగిందో నిర్ధారించ‌డానికి త‌మ వ‌ద్ద GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లోకేష‌న్ లేద‌ని అన్నారు. త‌మ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంద‌ని ఎస్పీ తెలిపారు.