Asianet News TeluguAsianet News Telugu

ఒంటరి వాడినైతానని.. నితీష్ భయపడుతున్నారు.. పీకే సెటైర్లు  

జేడీయూ పగ్గాలు చేపట్టాలని నితీష్ కుమార్ ఇటీవలే తనను కోరినట్లు ప్రశాంత్ కిషోర్ మొదట ప్రకటించడంతో ప్రశాంత్ కిషోర్-నితీష్ కుమార్ మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఒకప్పుడు తాను అడిగాన‌నీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌శాంత్ కిషోర్  తోసిపుచ్చారు.  

Prashant Kishor says Nitish Kumar getting delusional, scared of being isolated
Author
First Published Oct 9, 2022, 2:22 PM IST

బీహర్ లో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.  బీహార్ సీఎం నితీష్ కుమార్,  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య అంత‌ర్యుద్దం కొన‌సాగుతోంది. జేడీయూని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్‌ కిషోర్‌ కోరారని నితీశ్‌ కుమార్‌ పేర్కొన్న‌ ఆరోపణల‌ను ప్ర‌శాంత్ కిషోర్ తోసిపుచ్చారు.  

జేడీయూని  కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు కోరుకున్నారని, త‌న‌ పై వృద్ధాప్య సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ఆరోపణలను ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ ఆదివారం తోసిపుచ్చారు .

నితీష్ కుమార్ ఏదో చెప్పాలనుకుంటాడు కానీ ఇంకేదో మాట్లాడుతున్నాడని ప్రశాంత్ కిషోర్ అన్నారు. దీనిని ఇంగ్లీషులో బీయింగ్ డెల్యూషనల్ అంటారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మొదట తాను బీజేపీ అజెండాపై పని చేస్తున్నానని నితీష్ ఆరోపించారనీ, ఆ తర్వాత..  పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని తాను కోరానని అతను పేర్కొన్నాడు. రెండూ ఎలా సాధ్యమయ్యాయి?  తాను బిజెపి కోసం.. పని చేస్తుంటే.. తాను ఎందుకు బలవంతం చేస్తాను? అది నిజమైతే.. మొదటి ప్రకటన తప్పని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

నితీష్ కుమార్ ఆందోళన చెందుతున్నారు.. ఎక్కడో రాజకీయంగా తాను ఒంటరి అవుతున్నారు. ఆయ‌న‌ చూట్టూ నమ్మకం లేని వ్యక్తులు ఉన్నారనీ, ఒకవైపు వయస్సు, మరోవైపు ఒంటరితనంలో ఉన్నార‌ని  ప్రశాంత్ కిషోర్ అన్నారు.

తన 3,500 కిలోమీటర్ల జన్ సూరాజ్ పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇటీవల మాట్లాడుతూ... నితీష్ కుమార్ తనను జెడి(యు)కి నాయకత్వం వహించమని అభ్యర్థించారని తనను ఆహ్వానించారని చెప్పారు. నితీష్ కుమార్ ఎన్‌డిఎ కూటమిని విచ్ఛిన్నం చేసి, మహాఘట్‌బంధన్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్ర‌శాంత్ కిషోర్  ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సమావేశంలో నితీష్ కుమార్ పీకేని తన రాజకీయ వారసుడని కూడా పిలిచారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.  నితీష్ కుమార్ నన్ను తన రాజకీయ వారసుడిగా చేసినా, తన‌ కోసం సిఎం కుర్చీని ఖాళీ చేసినా.. తాను అతనితో కలిసి పని చేయనని అన్నారు. ఆ సీఎం ప‌ద‌వి ఇచ్చిన త‌న‌కు వ‌ద్ద‌ని పేర్కొన్నారు. 

ప్రశాంత్ కిషోర్ వాదనపై నితీష్ కుమార్ ను ప్రశ్నించగా..  తాను ప్రశాంత్ కిషోర్‌ను ఆహ్వానించలేదని చెప్పారు. పీకేనే  స్వయంగా తనను కలవడానికి వచ్చారని  అన్నారు. ఆయ‌న‌ చాలా మాట్లాడతాడు కానీ ఒకప్పుడు.. త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని.. త‌న‌ని కోరిన విషయాన్ని దాచాడని అని నితీష్ కుమార్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ చెప్పినట్లు మాట్లాడుతున్నాడని, బీజేపీతో లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నాడని నితీష్ కుమార్ అన్నారు. 

కాగా,  ప్ర‌శాంత్ కిషోర్‌ను 2018లో  జేడీయూలోకి నితీష్ కుమార్ చేర్చుకున్నారు. కొన్ని వారాల్లోనే జాతీయ ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగారు. అయితే, పౌరసత్వ (సవరణ) చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్‌పై నితీష్ కుమార్‌తో జరిగిన గొడవ కార‌ణంగా రెండేళ్లలోపే పార్టీ నుండి బ‌యట‌కు వ‌చ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios