ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ఐదుగురు మరణించారు. ఐరన్ రాడ్‌ను వేసుకుని ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్న వారు.. హై టెన్షన్ కరెంట్ వైర్లతో కాంటాక్ట్ అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉండటం గమనార్హం. బహ్రెయిచ్ జిల్లాలో నాన్‌పార ఏరియాలో మాసుపూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హైటెన్షన్ కరెంట్ వైర్‌లతో బాధితులు కాంటాక్ట్‌లోకి రావడంతో ఈ ఘటన జరిగింది.
బాధితులు సహా మరికొందరు ఎడ్ల బండి పై వెళ్లుతున్నారు. ఆ ఎడ్ల బండిలో ఐరన్ రాడ్ కూడా వెంట తీసుకెళ్లుతున్నారు. మాసుపూర్ గ్రామంలో ఉదయం 4 గంటలకు వారు వెళ్లుతుండగా హై టెన్షన్ కరెంట్ వైర్లు కాంటాక్టులోకి వచ్చినట్టు స్థానికులు చెప్పారు.
ఈ ఘటనను అడిషనల్ ఎస్పీ రూరల్ అశోక్ కుమార్ ఈ ఘటనను ధ్రువీకరించారు. నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మరణించారని వివరించారు. మరొకరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితులు విషమించి మరణించారు. పలువురికి కరెంట్ షాక్ కారణంగా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆ పోలీసు అధికారి వివరించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదత్యానాథ్ స్పందించారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.