Asianet News TeluguAsianet News Telugu

మ‌రోసారి డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవం 

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే సీనియర్‌ నేత ఎంకే స్టాలిన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయ‌న రెండవసారి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నాయకుడు దురై మురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా,  టిఆర్ బాలు కోశాధికారిగా ఎన్నికయ్యారు.

MK Stalin Elected As President Of DMK For The Second Time
Author
First Published Oct 9, 2022, 12:32 PM IST

త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ సీనియర్ నేత ఎంకే స్టాలిన్ రెండో పర్యాయం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన  పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సీనియర్ నేత ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ పార్టీ అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఎన్నికయ్యారు. వీరు కూడా రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. 

తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరుణానిధి మరణం తర్వాత 2018లో పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

డీఎంకే 1949లో స్థాపించబడింది. ద్రవిడ ఉద్యమ పార్టీ, డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై 1969లో మరణించే వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అ తరువాత కరుణానిధి తొలి సారి డీఎంకే అధ్యక్షుడయ్యారు. ఆయ‌న‌ 1969లో మరణించే వరకు అత్యున్నత పదవిలో కొనసాగాడు.

Follow Us:
Download App:
  • android
  • ios