ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, ఆ త‌ర్వాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లతో పాటు భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌పై ప్రధాని న‌రేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మోదీ ఏం అన్నారంటే..   

ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసంచేసిన ప్రతిజ్ఞ అని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. పాక్ లోని ఉగ్రస్థావారాలపై మన సైన్యం దాడులు చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టిందని మోదీ చెప్పుకొచ్చారు. 

ఆపరేషన్ సింధూర్ ఒక పేరు మాత్ర‌మే కాదు:

ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక పేరు కాదని కోట్లాది మంది భారత ప్రజల భావోద్వేగానికి ప్రతి రూపం అని మోదీ అన్నారు. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలందరి తరఫున భారత సైన్యానికి మోదీ అభినందనలు తెలియ‌జేశారు. పాకిస్థాన్‌కు పీవోకేను వదలడం తప్ప  మరో మార్గం లేదని స్ప‌స్టం చేశారు. 

మన బలగాలకు నా సెల్యూట్‌: 

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మన బలగాలకు నా సెల్యూట్‌ అని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌లో సాహసోపేతమన ప్రదర్శన చేశారన్నారు. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు.

ఉగ్రవాదుల క్రూరత్వానికి తగిన గుణపాఠం చెప్పాం

ఉగ్రవాదుల క్రూరత్వం భరించలేని స్థితికి చేరింది. కుటుంబం, కన్నబిడ్డల ముందే దయలేకుండా ప్రాణాలు తీశారు. మన తల్లుల సింధూరం చెరిపితే ఏం జరుగుతుందో చూపించామన్నారు. ఉగ్ర కురత్వానికి తగిన గుణపాణం చెప్పామన్నారు మోదీ.