జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉగ్రవాద సంస్థ టిఆర్ఎఫ్ కమాండర్ ను భద్రతా బలగాలు ట్రాప్ చేయడం గమనార్హం. 

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

పహల్గాం దాడి తర్వాత మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలోనే ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా మరోసారి ప్రధాని భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఉన్నతాధికారులు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించారు. 

ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదసంస్థ టిఆర్ఎఫ్ కమాండర్ ఆసిఫ్ ఫౌజీని భద్రతా బలగాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా కమిటీ సమావేశం భేటీ ఆసక్తికరంగా మారింది.