ఆపరేషన్ సింధూర్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.
ఆపరేషన్ సింధూర్:భారత దేశం పాకిస్తాన్ పై బుధవారం తెల్లవారు జామున దాడులు చేసింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలసిందిే. తర్వాత, భారతదేశం బుధవారం 'ఆపరేషన్ సింధూర్'ని ప్రారంభించి, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో ఈ సమాచారాన్ని వెల్లడించింది.
భారత మిస్సైల్ దాడులు పాకిస్తాన్‌లోని మూడు ప్రాంతాలైన ముజఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్‌లోని అహ్మద్ ఈస్ట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని పాకిస్తాన్ సైన్యం బుధవారం ధృవీకరించింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన
ఆపరేషన్ సింధూర్ పక్కా లక్ష్యంతో కూడినది. అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ఏ పాకిస్తానీ సైనిక స్థావరంపైనా దాడి జరగలేదని ప్రకటనలో పేర్కొంది. లక్ష్యాల ఎంపిక చేసుకుని దాడి చేశామని వివరించింది. ఈ విషయంలో భారతదేశం అత్యంత సంయమనం పాటించిందని తెలిపింది.
పహల్గాం దాడికి ప్రతీకారం, ఉగ్రవాదులకు శిక్ష
25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు పహల్గాం ఉగ్రదాడిలో దారుణంగా హత్యకు గురయ్యారు.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించడం ఖాయమని భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది.
భారత సైన్యం సందేశం: 'Justice is served. Jai Hind!'
భారత సైన్యం సోషల్ మీడియా వేదిక 'X'లో పోస్ట్ చేస్తూ, Justice is served. Jai Hind! అని రాసింది. "ప్రహారాయ సన్నిహితాః, జయాయ ప్రశిక్షితాః" అంటే 'దాడి చేయడానికి సిద్ధంగా, గెలవడానికి శిక్షణ పొందినది. అని పేర్కొంది.
త్వరలో వివరణాత్మక ప్రెస్ బ్రీఫింగ్
'ఆపరేషన్ సింధూర్' గురించి పూర్తి సమాచారం ఈ రోజు తర్వాత ఒక ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా వెల్లడిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
