Operation Kagar: వచ్చే ఏడాది నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున ఎన్‌కౌంటర్లు అవుతుండగా..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలాలకు పెద్ద విజయంగా బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 32 మందిపై భారీగా రివార్డులు ఉండటం గమనార్హం. ఈ 32 మందిపై మొత్తం ₹1.19 కోట్లు రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో టాప్, మిడ్ లెవల్ నక్సలైట్లు కూడా ఉన్నారు. వీరిలో రూ. 8 లక్షల చొప్పున రివార్డు ఉన్న 9 మంది.. పండరూ హప్కా (మోహన్), అతని భార్య బండి హప్కా, లక్కూ కోర్సా, బడ్రూ పునేం, సుఖరాం హేమ్లా, అతని భార్య మంజుల హేమ్లా (శాంతి), మంగ్లీ మాడ్వీ (శాంతి), జయరాం కడియం, పాండో మడకం (చాందనీ).
మాటా కడియం (మంగళ), జమ్లీ కడియం, జోగీ మడకం (మాలతి)లపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. కాగా 12 మందిపై రూ. 2 లక్షలు, 8 మందిపై రూ. 1 లక్ష రిమాండ్ ఉంది. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రూ. 50,000 ప్రోత్సాహకంగా వెంటనే అందజేస్తోంది. అదనంగా, రీహాబిలిటేషన్ పథకాల ద్వారా సామాన్య జీవితంలోకి తిరిగి చేరుకునే అవకాశాలు కల్పిస్తారు.
వీరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, ధమతరి–గర్యాబంద్–నువాపడ ప్రాంతాలకు చెందిన నక్సల్ సంస్థల్లో పనిచేశారు. లొంగిపోయిన వారంతా.. భారత రాజ్యాంగంపై నమ్మకంతో, శాంతియుతమైన జీవనం గడపాలని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం బీజాపూర్ జిల్లాలో:
528 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు
560 మంది ప్రధాన ప్రవాహంలోకి చేరారు
144 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించారు


