- Home
- Sports
- Cricket
- 31 బంతుల్లో సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊచకోత.. ఇంతకీ ప్లేయర్ ఎవరంటే.?
31 బంతుల్లో సెంచరీ.. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊచకోత.. ఇంతకీ ప్లేయర్ ఎవరంటే.?
Hyderabad: ప్రతీ బంతి బౌండరీ వైపే పరిగెత్తింది. బాల్ వేయడానికే బౌలర్లు భయపడే పరిస్థితి. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు యంగ్ ప్లేయర్. ఇంతకీ ఎవరా ప్లేయర్.? ఏంటా మ్యాచ్.? ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో ఉర్విల్ పటేల్ సునామీ
సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ తొలి రోజు హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్‌లో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ అద్భుత శతకం బాదాడు. కేవలం 31 బంతుల్లో 100 పరుగులు చేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సులు ఉండడం విశేషం.
సర్వీసెస్ స్కోరు – గుజరాత్ బౌలర్లకు బలమైన సవాల్
ముందుగా బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ జట్టు 182/9 స్కోరు చేసింది. మధ్య ఓవర్లలో గుజరాత్ బౌలర్లు బాగా కట్టడి చేయడంతో సర్వీసెస్ పెద్ద స్కోరును సాధించలేకపోయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం ఈ లక్ష్యాన్ని చేధించింది.
ఉర్విల్–ఆర్య దూకుడు
టార్గెట్ ఛేజ్‌లో గుజరాత్ ఓపెనర్లు ఉర్విల్ పటేల్, ఆర్యా దేశాయి గట్టిగా దాడి చేశారు. ఇద్దరూ కలిసి 174 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. బౌండరీల వర్షంలో సర్వీసెస్ బౌలర్లు పూర్తిగా ఒత్తిడికి లోనయ్యారు. ఉర్విల్ పటేల్ 37 బంతుల్లో 119తో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. అతడి బ్యాట్ నుంచి 12 ఫోర్లు, 10 సిక్సులు వచ్చాయి.
IPL ప్రస్థానం – CSKలో కీలక స్థానం
గత IPL సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఉర్విల్‌ను ఈ ఏడాది జరగనున్న మినీ వేలానికి ముందు జట్టు రిటైన్ చేసింది. గత సీజన్‌లో మూడు ఇన్నింగ్స్‌లోనే 200 స్ట్రైక్ రేట్ దాటడం అతడి మీద నమ్మకం పెంచింది. ఆసక్తికర అంశం ఏమంటే 2025 IPL మెగా వేలంలో అమ్ముడుపోనప్పటికీ, అనంతరం వంశ్ బేడి స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు.
టాప్‌లో ఉర్విల్
ఉర్విల్ ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. భారత బ్యాటర్లలో వేగవంతమైన టీ20 శతకాల జాబితాలో అతడికి రెండు స్థానాలు వచ్చాయి.
28 బంతులు – ఉర్విల్ పటేల్ (గుజరాత్ vs త్రిపుర, 2024)
28 బంతులు – అభిషేక్ శర్మ (పంజాబ్ vs మేఘాలయ, 2024)
31 బంతులు – ఉర్విల్ పటేల్ (గుజరాత్ vs సర్వీసెస్, 2025)

