Asianet News TeluguAsianet News Telugu

చిన్నారులపై జరిగే ప్రతీ మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరమే - నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా వారిపై మూడు నేరాలు జరిగే అందులో ఒకటి లైంగిక నేరమే ఉంటోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

One in three crimes against children is a sex crime - National Crime Records Bureau
Author
First Published Oct 30, 2022, 4:53 PM IST

దేశంలో చిన్నారులపై నేరాలు పెరుగుతున్నాయి. ఈ ప్రతీ మూడు నేరాల్లో ఒకటి లైంగిక నేరమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఎన్ సీఆర్బీ తాజాగా విడుదల చేసిన డాటా ప్రకారం.. 2021 సంవత్సరంలో  పిల్లలపై మొత్తంగా 1,49,404 నేరాల కేసులు నమోదు కాగా, అందులో 53,874 కేసులు POCSO (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టం కింద నమోదయ్యాయి. అయితే 2020లో 1,28,531 కేసులు నమోదయ్యాయి. అంటే నేరాల రేటు 16.2 శాతం పెరిగింది. ఈ ఎన్‌సీఆర్బీ గణాంకాలు పిల్లలపై జరిగే ప్రతి మూడవ నేరం పోక్సో చట్టం కింద నమోదవుతుందని చూపిస్తోంది.

గుజరాత్‌లో పాత పెన్షన్ విధానాన్ని తీసుకువ‌స్తాం: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ

2021 సంవత్సరంలో పోస్కో చట్టంలోని సెక్షన్‌లు 4, 6 (చొచ్చుకొనిపోయే లైంగిక వేధింపులు, ఉగ్రమైన లైంగిక వేధింపులకు శిక్ష) కింద మొత్తం 33,348 ఘటనలు నమోదయ్యాయి. ఇందులో బాధితులు 33,036 మంది బాలికలు కాగా, 312 మంది బాలురు ఉన్నారు. దేశవ్యాప్తంగా 67,245 పిల్లల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. 2021లో చిన్నారులపై 7,783 నేరాలతో కేంద్ర ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. నాగాలాండ్‌లో చిన్నారులపై అత్యల్ప నేరాలు నమోదయ్యాయి. కాగా.. పిల్లలపై మొత్తం నేరాల రేటు 2020లో 28.9 శాతం నుంచి 2021లో 33.6 శాతానికి పెరిగింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఇజ్జత్ పోతే ప్రాణం పోయినట్టే: సీజేఐకి బెంగాల్ సీఎం మమతా విజ్ఞప్తి

ఎన్‌సీఆర్‌బి డేటా అనేక ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. 2021లో 140 మంది చిన్నారులను అత్యాచారం చేసి హత్య చేయగా, మరో 1,402 మంది చిన్నారులు కూడా హత్యకు గురయ్యారు. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లో పిల్లలపై అత్యధికంగా నేరాలు నమోదయ్యాయి. ఈ డేటా ప్రకారం.. గత ఏడాది 121 భ్రూణహత్య కేసులు నమోదయ్యాయి, వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్, గుజరాత్ (23 చొప్పున) కేసులు నమోదయ్యాయి. తరువాత ఛత్తీస్‌గఢ్ (21), రాజస్థాన్ (13) ఉన్నాయి. పిల్లల ఆత్మహత్యలకు ప్రేరేపించిన 359 కేసులు కూడా నమోదు అయ్యాయి. 

అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది.. మన్ కీ బాత్‌లో ఇస్రోను ప్రశంసించిన ప్రధాని మోడీ

గత ఏడాది దేశవ్యాప్తంగా 49,535 మంది చిన్నారులు అపహరణకు గురయ్యారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 9,415 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. 8,224 కేసులతో మధ్యప్రదేశ్ రెండో స్థానం, 5,135 కేసులతో ఒడిశా, 4,026 కేసులతో పశ్చిమ బెంగాల్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా.. గతేడాది 29,364 మంది పిల్లలు తప్పిపోయినట్లు డేటా వెల్లడించింది. దీంతో పాటు 1,046 మంది చిన్నారులు అక్రమ రవాణాకు గురయ్యారు. 2021లో ఢిల్లీలో దాదాపు 5,345 మంది చిన్నారులు అపహరణకు గురయ్యారని గణాంకాలు పేర్కొన్నాయి.

గుజరాత్‌లో పాత పెన్షన్ విధానాన్ని తీసుకువ‌స్తాం: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ

ఎన్ సీఆర్బీ డేటా ప్రకారం.. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదయ్యాయి. ఇందులో 305 కేసులతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అస్సాం ఉంది. గతేడాది మొత్తంగా బాల్య వివాహాల నిషేధ చట్టం కింద 1,062 కేసులు నమోదవగా.. అందులో మొదటి మూడు రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, అస్సాం నిలిచాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios