Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ టిక్కెట్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానన్న కంగనా రనౌత్.. స్వాగతించిన జేపీ నడ్డా.. కానీ..

ఎట్టకేలకు సినీ నటి కంగనా రనౌత్ తన మనసులోని మాటను బయటపెట్టింది. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు ఓ కార్యక్రమంలో తెలిపారు. అయితే దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పటికప్పుడే తన పార్టీ వైఖరిని వెల్లడించారు. 

Kangana Ranaut said she will contest the election on BJP ticket.. JP Nadda welcomed.. but..
Author
First Published Oct 30, 2022, 1:20 PM IST

నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మనసులోని కోరికను బయటపెట్టారు. అవకాశం ఇస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 

కాల్చేందుకు సిగరెట్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య.. ఆగ్రాలో ఘటన

‘‘ పార్టీ (బీజేపీ) హిమాచల్ ప్రజలు నేను మండి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తే నాకు ఇలాంటి అభ్యంతరం లేదు. అయితే పోరాడే, సమర్థులైన వ్యక్తులు రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు వేయాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ నాకు టిక్కెట్టు ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏ పరిస్థితి వచ్చిన ప్రభుత్వం నన్ను పాల్గొనాలని ఆదేశిస్తే, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. నా తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే మా నాన్న కాంగ్రెస్ లోనే పని చేశారు. కానీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక ఆయనలో ఒక్కసారిగా పరివర్తన వచ్చింది. మా నాన్న మొదటి నుంచి మోడీ గురించి చెబుతున్నారు. 2014లో మేం అధికారికంగా మతం మారాము. ఇప్పుడు మా నాన్న ఉదయం లేవగానే జై మోడీ జీ, రాత్రి జై యోగి జీ అని మాట్లాడుతున్నారు ’’ అని కంగనా రనౌత్ అన్నారు. 

కంగనా ప్రకటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే కార్యక్రమంలో స్పందించారు. ఆమె నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తున్నదని తెలిపారు. అయితే బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలనే విషయం పార్టీలో సంప్రదింపులు జరిపిన తరువాత నిర్ణయం తీసుకుంటామని నడ్డా అన్నారు. “ పార్టీ కోసం పని చేయాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. కంగనా బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలా వద్దా అనేది నేను ఒక్కడిని నిర్ణయించలేను. దాని కోసం పార్లమెంటరీ కమిటీ ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఎన్నికల సంఘం ప్రక్రియ ఉంది. ’’ అని నడ్డా తెలిపారు. 

న్యూఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం: గాలి నాణ్యత 367 గా నమోదు

‘‘ కండీషన్ లతో ఎవరీని మేము ఎవరినీ పార్టీలో ఉంచుకోవడం లేదు. ఈ సందర్భంగా మేము ఈ విషయం అందరికీ చెబుతున్నాం. మీరు షరతులు లేకుండా రావాలని, అప్పుడే దానిపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుంది.’’ అని జేపీ నడ్డా బీజేపీ వైఖరిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మల్లీ బీజేపీకి ఓటు వేయనున్నారని చోద్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రంలో గెలిచి తీరుతామని తెలిపారు. 

10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్రం పనిచేస్తోంది: ప్ర‌ధాని నరేంద్ర మోడీ

ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. 2017లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ఆమ్ ఆద్మీ కూడా ఇక్కడ విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios