Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో పాత పెన్షన్ విధానాన్ని తీసుకువ‌స్తాం: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ

Rahul Gandhi: గుజరాత్‌లో కాంగ్రెస్ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తుందని ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నారు. "కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్‌ను తిరిగి తీసుకురావడం, సకాలంలో పదోన్నతులు కల్పిస్తాం"  ఇది కాంగ్రెస్ గట్టి హామీ అని రాహుల్ గాంధీ అన్నారు.
 

Will bring back old pension system in Gujarat: Congress leader Rahul Gandhi
Author
First Published Oct 30, 2022, 4:08 PM IST

Gujarat Elections: ఈ ఏడాదిలోనే గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్ని వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నాయి. అధికారం పీఠం ద‌క్కించుకోవాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్లమెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తుందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు స్థిర ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్‌ను తిరిగి తీసుకురావడం, సకాలంలో పదోన్నతులు కల్పిస్తామని ఇది కాంగ్రెస్ గట్టి హామీ అని రాహుల్ గాంధీ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులకు ప‌ర్మినెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి తీసుకువస్తామనీ, సకాలంలో పదోన్నతులు కల్పిస్తామని  వెల్ల‌డించారు. "కాంట్రాక్ట్ కార్మికులకు స్థిర ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్, సకాలంలో పదోన్నతులు తీసుకురావడం" ఇది కాంగ్రెస్ దృఢమైన వాగ్దానం అని గాంధీ హిందీలో ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

"రాజస్థాన్‌లో దీనిని అమలు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు వారి బకాయిలు లభిస్తాయి" అని 'కాంగ్రెస్ దేగీ పక్కి నౌక్రి ' హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంత‌కుముందు బీజేపీని టార్గెట్ చేస్తూ.. రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల ముందు.. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ నాయ‌కుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ట్విట్ట‌ర్ లో "ఎన్నికల ముందు - నేను తినను, నేను తినను. ఎన్నికల తర్వాత - నేను '40% కమీషన్' తింటాను, ఆపై దీపావళికి స్వీట్ బాక్స్‌లలో కర్ణాటక మీడియాకు లంచాలు పంపండి" అంటూ క‌ర్నాట‌క బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అలాగే, 'PayCMస' అండ్ 'PayPM' బీజేపీ-దేశ‌వ్యాప్తంగా 'డబుల్ ఇంజిన్' అవినీతి ప్ర‌భుత్వం అంటూ రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు.

 

ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాత్ర కొనసాగుతోంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాదయాత్ర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios