Coronavirus: డెల్టా మాదిరిగానే ఒమిక్రాన్ పంజా.. జనవరిలోనే పీక్ స్టేజ్ !.. ఆంక్షలు ఆపలేవు !
Coronavirus: భారత్ లో కరోనా పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ప్రస్తుత పరిస్థిలకు అద్దం పడుతోంది. ఇక దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందనీ, జనవరిలోనే పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Coronavirus: కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఒకరోనా వైరస్ కొత్త వేరియంట్ పరిస్థితులను దారుణంగా మారుస్తున్నది. ఈ వేరియంట్ కేసులు భారత్ లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త కరోనా వైరస్ కేసులు సైతం మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 50వేలకు పైగా కొత్త కేసులు (Coronavirus) నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది. ఇదిలావుండగా, దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Third Wave) అంచనాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. భారత్ లో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఈ జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని పేర్కొంటున్నారు. భారతదేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నమోదైన దాని కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు వెలుగుచూసే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామీలో భారత్ చుట్టుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుదల (Third Wave) దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
Also Read: Coronavirus: కోవిడ్ నిధుల వినియోగంలో వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రాలు.. టాప్‌లో ఢిల్లీ, తమిళనాడు
కాగా, ఇతర దేశాల కంటే భారత్ కరోనా మహమ్మారిని మెరుగ్గా నిర్వహించిందనీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ.. గత 24 గంటల్లో కరోనా వైరస్ కొత్త కేసులు ఏకంగా 50 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు మరింతగా పెరిగాయి. కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కారణంగా ఇండియాలో వస్తుందని పేర్కొన్న డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే.. కరోనా (Coronavirus) టీకాలు వేయడం వల్ల లక్షణాలు స్వల్పంగా ఉంటాయని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని తెలిపారు. ఎన్ని ఆంక్షలు విధించినా ఆపలేమని ఆయన పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఓ జాతీయ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే మాట్లాడుతూ.. ఓమిక్రాన్ వేరియంట్ కేవలం రెండు నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుందని అన్నారు. "ఈ ఉప్పెన మధ్య, భారతదేశం డెల్టా వేవ్ సమయంలో చూసినన్ని ఇన్ఫెక్షన్లను మళ్లీ చూస్తుంది" అని ఆయన చెప్పారు. జనవరి మధ్యలో ఒమిక్రాన్ వ్యాప్తి గరిష్ట స్థాయిని చేరుకోవచ్చని (Third Wave) అంచనా వేస్తూ, ఇది రోజుకు 35 మిలియన్లకు పైగా గ్లోబల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏప్రిల్‌లో డెల్టా వేవ్ పీక్ (Coronavirus) సమయంలో కనిపించిన సంఖ్య కంటే ఇది మూడు రెట్లు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు.
Also Read: Coronavirus: కరోనాకు మరో కొత్త మందు.. వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..
"భారతదేశంలో, అంటువ్యాధుల సంఖ్య జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి" అని డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అన్నారు. "నివేదించబడుతున్న కేసులు అంటువ్యాధుల కంటే తక్కువ రేటుతో పెరుగుతాయి, ఎందుకంటే లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్-గుర్తింపు రేటును తగ్గిస్తుంది" అని ఆయన ఆయన అంచనా వేశారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆస్పత్రుల్లో చేరడం.. ప్రాణాలు కోల్పోవడం కాస్తా తక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రస్తుతం కరోనా (Coronavirus) ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. ఇదివరకు ఎప్పుడూ నమోదుకాని రీతిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో నమోదైన విధంగా కరోనా మరణాలు, ఆస్పత్రుల్లో తప్పని సరిగా వైద్యం అందించాల్సిన పరిస్థితులు ఏర్పడటం లేదని పేర్కొన్నారు. అయితే, (Coronavirus) ఒమిక్రాన్ గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రాలేదు కాబట్టి.. వైరస్‌కట్టడి కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే పేర్కొన్నారు.
Also Read: coronavirus: కరోనా సోకినా.. ఆక్సిజన్ అవసరమయ్యేవారు తక్కువే..!