Coronavirus: క‌రోనాకు మ‌రో కొత్త మందు.. వ‌చ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..

Coronavirus: చాలా దేశాల్లో క‌రోనా వ్యాప్తి పెరుగుతోంది. భార‌త్ లోనూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో కోవిడ్-19 క‌ట్ట‌డి కోసం ప‌లు కంపెనీలు మందులను అందుబాటులోకి తీసుకువ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌రో కొత్త ఔష‌ధం వ‌చ్చేవారంలో అందుబాటులోకి రానుంది. దీని దీని ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. 
 

Dr Reddys prices anti COVID19 molnupiravir capsules at rs 35 each

Coronavirus: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ సృష్టించిన సంక్షోభం మార‌వ‌క‌ముందే మ‌రోసారి కోవిడ్‌-19 ఉప‌ద్ర‌వం ముంచుకొస్తున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ సైతం చేతులెత్తేసింది. లక్ష‌లాది మందికి వైద్యం అందించ‌లేని ప‌రిస్థితులు.. మందులు, ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింది.  ఈ క్ర‌మంలోనే భార‌త్ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌పై దృష్టి సారించి.. మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తే.. పెద్ద న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండే విధంగా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీనిని అనుగుణంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకువ‌స్తున్న ఔష‌ధాల‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని అత్య‌వ‌స‌ర వినియోగం కింద అనుమ‌తులు ఇస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త్ మార్కెట్ లోకి  క‌రోనా కొత్త మందులు అందుబాటులోకి రాబోతున్న‌ది. వ‌చ్చేవారం నుంచి దేశంలోని అన్ని మెడిక‌ల్ స్టోర్ల‌లో ఇవి లభించ‌నున్నాయి. వీటి ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌నుంద‌ని స‌మాచారం.

Also Read: coronavirus: క‌రోనా సోకినా.. ఆక్సిజన్ అవ‌స‌రమ‌య్యేవారు త‌క్కువే..!

వివ‌రాల్లోకెళ్తే..  భారతీయ ఫార్మా దిగ్గ‌జ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ క‌రోనా వైరస్ కోసం కొత్త ఔషధాన్ని విడుదల చేయబోతోంది. ఈ యాంటీవైరల్ క్యాప్సూల్ పేరు మోల్నుపిరవిర్. దీని ధర మ్యాన్‌కైండ్ ఫార్మా క్యాప్సూల్స్ ధరతో సమానంగా ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ తన బ్రాండ్ పేరు మోల్‌ఫ్లూతో క్యాప్సూల్స్‌ను విడుదల చేయనుంది. భారతదేశంలోని మొత్తం 13 కంపెనీలు మోల్నుపిరావిర్‌ను తయారు చేయనున్నాయని  కేంద్ర ఆరోగ్య మంత్రి ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గత వారం వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.  మోల్‌ప్లూ బ్రాండ్ పేరుతో క్యాప్సుల్స్ ను వ‌చ్చే వారం విడుద‌ల చేయ‌బోతున్నామ‌నీ, భార‌త ఔష‌ధ నియంత్ర‌ణ మండ‌లి అత్య‌వ‌స‌ర వినియోగం కింద అనుమ‌తులు మంజూరు చేసింద‌నీ,  ఒక్కొక్కటి ₹35 చొప్పున విక్ర‌యించున్నామ‌నీ, ఇది 200 మిల్లీ గ్రాములు ఉంటుంద‌ని డాక్ట‌ర్ రెడ్డీస్ లాబొరేట‌రీస్ పేర్కొంది. ప్రతి స్ట్రిప్‌లో 10 క్యాప్సూల్స్ ఉంటాయి. సిఫార్సు చేయబడిన మోతాదు 800 mg రోజుకు రెండుసార్లు ఐదు రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి 40 క్యాప్సూల్స్‌ల మొత్తం కోర్సుకు  రూ.1,400 ఖర్చు అవుతుంది. క‌రోనా రోగుల‌కు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అత్యంత స‌ర‌స‌మైన చికిత్స ఎంపిక‌ల్లో ఇది ఒక‌ట‌ని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ తెలిపింది. 

Also Read: Coronavirus: పాట్నా మెడిక‌ల్ కాలేజీలో 159 మంది వైద్యుల‌కు క‌రోనా

ఇక దేశంలో క‌రోనా కేసులు ప్ర‌స్తుతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. మ‌రోవైపు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ సైతం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ మందులు ఎక్కువ‌గా అందుబాటులో కి తీసుకువ‌చ్చే దానిపై దృష్టి సారించిన‌ట్టు తెలుస్తున్న‌ది. USFDA-ఆమోదించిన నిబంధనలతోనే Molflu తయారు చేశారు. వచ్చే వారం నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులోకి ఉంటుంది. మోల్‌ఫ్లూ దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మసీలలో అందుబాటులో ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, డాక్టర్ రెడ్డీస్ భారతదేశంతోపాటు 100 కంటే ఎక్కువ మధ్య-ఆదాయ దేశాలలో mollupiravir తయారీ, సరఫరా చేయడానికి Merck Sharp Dohmeతో నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంద‌ని స‌ద‌రు సంస్థ వెల్ల‌డించింది.  భార‌త్ లో ఈ ఔష‌ధాన్ని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్య‌బొరేట‌రీస్ తో పాటు  మ్యాన్‌కైండ్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, సిప్లా, సన్ ఫార్మా, నాట్కో, మైలాన్, హెటెరోతో సహా మొత్తం 13 భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ మందును తయారు చేస్తున్నాయి. ఆయా కంపెనీలు ధ‌ర‌లు సైతం ఇదే త‌ర‌హాలో ఉండే అవ‌కాశ‌ముంద‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

Also Read: coronavirus: అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల కేసులు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios