coronavirus: క‌రోనా సోకినా.. ఆక్సిజన్ అవ‌స‌రమ‌య్యేవారు త‌క్కువే..!

coronavirus: దేశంలో క‌రోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ నాటి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసోషియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఊర‌ట క‌లిగించే విష‌యం వెల్ల‌డించింది. 
 

1 in 200 Covid Patients Needs Oxygen Support in Pvt Hospitals Across India

coronavirus: భార‌త్ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అత్యంత ప్ర‌మాక‌ర‌ద‌మైన క‌రోనా వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ బారిన‌ప‌డుత‌న్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. ద‌క్షిణాఫ్రికా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిట‌న్ వంటి దేశాల్లో క‌రోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. అమెరికాలో అయితే, 70 శాతానికి పైగా రోగుల‌తో అక్క‌డి ఆస్ప‌త్రులు నిండిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా సెకండ్ వేవ్ నాటి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నలు వ్య‌క్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్ స‌మయంలో క‌నీస వైద్యం, ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ళ్లీ థ‌ర్డ్ అంచ‌నాలు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. అయితే, అసోషియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్‌పీఐ) కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం వెల్ల‌డించింది. కరోనా సోకిన ప్రతి 200 మంది బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వస్తోందని పేర్కొంది.

Also Read: Coronavirus: పాట్నా మెడిక‌ల్ కాలేజీలో 159 మంది వైద్యుల‌కు క‌రోనా

Association of Healthcare Providers India (AHPI) దేశంలోని ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌డానికి దేశంలోని 2,500 సూపర్ స్పెషాలిటీ, 8వేల చిన్నస్థాయి ఆస్ప‌త్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు కీల‌క విషయాలు వెల్లడించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆస్ప‌త్రుల్లో చేరిన బాధితుల్లో 0.5 శాతం కంటే తక్కువమందికే ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. అంటే ప్రతి 200 మందిలో ఒక్కరికి మాత్రమే ఈ అవసరం ఉంటోంది. కరోనా రెండో వేవ్‌ సమయంలో కంటే భిన్నమైన పరిస్థితని పేర్కొంది. అలాగే,  క‌రోనా మ‌హ‌మ్మారి  లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరినా.. సగటున మూడు రోజులు మాత్రమే హ‌స్పిట‌ల్స్ లో ఉండాల్సిన ప‌రిస్థితులు ఉంటున్నాయ‌ని తెలిపింది. ఇక  దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో మహారాష్ట్ర, దేశ రాజ‌ధాని ఢిల్లీల వాటానే అధికంగా ఉంటున్న‌ద‌నీ, అయినా సరే, అక్కడి ఆస్ప‌త్రుల్లో పడకల లభ్యత 90 శాతం కంటే ఎక్కువగానే ఉంద‌ని Association of Healthcare Providers India (AHPI) స్ప‌ష్టం చేసింది. క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో దాదాపు 9 నుంచి 10 శాతం పడకలు మాత్రమే నిండుతున్నాయ‌ని తెలిపింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 10 శాతం కంటే త‌క్కువ‌గానే ప‌డ‌క‌లు నిండుతున్నాయ‌ని Association of Healthcare Providers India (AHPI)  డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జె.జ్ఞాని వెల్ల‌డించారు. 

Also Read: coronavirus: అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల కేసులు !

ఇదిలావుండ‌గా, క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో విప‌రీతంగా కేసులు పెరిగి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో అయితే, ఆరోగ్య వ్య‌వ‌స్థ చేతులెత్తేసింది. క‌నీస వైద్యం అంద‌క వేలాది మంది ఆస్ప‌త్రుల ముందు ప‌డిగాపులు ప‌డ్డారు. అనేక మంది ప్ర‌ణాలు కోల్పోయారు. మందులు లేక‌, ఆక్సిజ‌న్ కొర‌త‌తోనూ ప్రాణాలు కోల్పోయిన హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు సెకండ్ వేవ్ స‌మ‌యంలో చోటుచేసుకున్నాయి. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కార‌ణంగా దేశంలో క‌రోనా హ‌మ్మారి కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. థ‌ర్డ్ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జలు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.  అయితే, భార‌త్ లో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ కు కార‌ణ‌న‌మైన డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ తో ఆస్ప‌త్రి పాల‌య్యే ప్ర‌మాదం కాస్త త‌క్తువ‌గా ఉంటుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు పేర్కొన‌డం ఊర‌ట క‌లిగిస్తున్న‌ది. 

Also Read: Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒక‌రి అరెస్టు.. స‌మాచారం లేద‌న్న బెంగ‌ళూరు పోలీసులు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios