Coronavirus: కోవిడ్ నిధుల వినియోగంలో వెనుకబడ్డ ఈశాన్య రాష్ట్రాలు.. టాప్‌లో ఢిల్లీ, తమిళనాడు
Coronavirus: దేశంలో కరోనా కారణంగా కోట్లాది మంది ప్రభావితమవున్నారు. అయినప్పటికీ.. కరోనా (Coronavirus) కట్టడిలో భాగంగా కేటాయించిన నిధుల వినియోగించడంలో కొన్ని రాష్ట్రాలు దారుణంగా వెనుకబడ్డాయని అధికారి డేటా గణాంకాలు పేర్కొంటున్నాయి. కరోనా నిధుల వినియోగంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు టాప్ లో ఉండగా.. పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర దారుణంగా వెనుకబడింది.
Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అయితే పరిస్థితులు అత్యంత దారుణంగా మారి.. ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాబోయే కోవిడ్-19 వేవ్ (Coronavirus) లను ఎదుర్కొవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇదివరకు కరోనా విజృంభణ సమయంలో కనీస వైద్యం, మందులు, ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రాబోయే కరోనా వేవ్ లను ఎదుర్కొవడానికి ఆరోగ్య మౌళిక సదుపాయాలను మరింతగా అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం ప్రభుత్వం.. రాష్ట్రాలకు నిధులు (Centre’s COVID fund) మంజూరు చేసింది. అయితే, ఈ కరోనా నిధులును ఉపయోగించడంలోనూ పలు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కేంద్రం విడుదల చేసిన ఈ నిధుల్లో 1% కంటే తక్కువ ఖర్చు చేసిన పెద్ద రాష్ట్రాలలో మహారాష్ట్ర చెత్త పనితీరును కనబర్చిందని అధికారిక డేటా గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే నమోదుకావడం గమనార్హం.
Also Read: Coronavirus: కరోనాకు మరో కొత్త మందు.. వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..
నేషనల్ ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ-II (ECRP II) కింద కేంద్రం విడుదల చేసిన రూ. 6,075 కోట్లలో రాష్ట్రాలు కేవలం రూ. 1,679 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. అంటే మొత్తం నిధుల్లో 27 శాతం అన్నమాట. కోవిడ్-19 ద్వారా ఎదురయ్యే ముప్పును నివారించడం, ముందస్తు అంచనాలు, రాబోయే పరిస్థితులను గుర్తించడం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం, అత్యవసర ప్రతిస్పందన కోసం జాతీయ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం (health infrastructure) ఈ పథకం ముఖ్యం లక్ష్యం. కానీ దేశంలో కరోనా ప్రబలంగా ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయనేదానికి ఈ నిధులు (Centre’s COVID fund) వినియోగం స్పష్టం చేస్తున్నది. ప్రస్తుతం కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ 9 శాతం కంటే తక్కువ కోవిడ్ నిధులను ఉపయోగించుకుంది. రాజస్థాన్ సైతం ఆ ఫండ్స్ లో 5 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన చెత్త పనితీరును కనబర్చిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. దారుణ ఆరోగ్య వ్యవస్థలకు పేరుగాంచిన, దేశంలో రెండో అత్యధిక జనాభా కలిగిన బీహార్ కేవలం 18% నిధులను మాత్రమే ఖర్చు చేసింది. దక్షిణాదిలో పలు రంగాల్లో అగ్రగామిగా, కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రంగా పేరుగాంచిన కేరళ కేవలం 20 శాతమే కేంద్ర నిధులను ఉపయోగించుకుంది.
Also Read: coronavirus: కరోనా సోకినా.. ఆక్సిజన్ అవసరమయ్యేవారు తక్కువే..!
ECRP II కింద దేశమంతటా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వనరులను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం రూ. 15,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తన వాటాను జోడించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న గణాంకాల ప్రకారం.. తన వాటా నుండి రాష్ట్రాలకు కేవలం 26% మాత్రమే విడుదల చేసిందన్న వాదనలను తిరస్కరించింది. గత ఏడాది ఆగస్టు నాటికి అది తన వాటాలో 50% నిధులు విడుదల చేసిందని పేర్కొంది. ఇప్పటివరకు, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాలు మాత్రమే 50% కంటే ఎక్కువ నిధులను ఖర్చు చేసినట్లు నివేదించాయి. విడుదల చేసిన సెంట్రల్ ఫండ్‌లో 138% ఖర్చు చేసిన ఢిల్లీ, నిర్దేశించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని తన సొంతంగా దానికి ఖర్చు చేసిందని తెలిపింది.ఈశాన్య ప్రాంతాలు, గోవా, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు వంటి అనేక రాష్ట్రాలు, UTలు ఇప్పటివరకు ఈ నిధులను ఖర్చు చేయలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. ECRP II ప్యాకేజీని సత్వర అమలు కోసం రాష్ట్రాలతో చురుకుగా ముందుకు సాగుతున్నామనీ.. ఖర్చులను రోజువారీగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: Coronavirus: పాట్నా మెడికల్ కాలేజీలో 159 మంది వైద్యులకు కరోనా