బుధవారం Uttarakhandలో కరోనావైరస్ కొత్త వేరియంట్ Omicron మొదటి కేసు వెలుగు చూసిన సంతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, కోవిడ్ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.గురువారం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

డెహ్రాడూన్ : ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లో నూ అనేక రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం Uttarakhandలో కరోనావైరస్ కొత్త వేరియంట్ Omicron మొదటి కేసు వెలుగు చూసిన సంతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, కోవిడ్ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

గురువారం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

“డిసెంబర్ 22న డెహ్రాడూన్‌లో ఒక ఒమిక్రాన్ కేసును గుర్తించిన తర్వాత, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లను తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, మందులతో పాటు బెడ్ లభ్యత వంటి తగిన సన్నాహక చర్యలు" తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారని ఒక ప్రకటన పేర్కొంది.

"COVID పరీక్ష, టీకా కోసం డోర్ టు డోర్ సర్వేను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించారు. అవసరమైతే, రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ, కోవిడ్ ఆంక్షలు విధించడంపై చర్చ ఉంటుంది" అని ఆ ప్రకటన పేర్కొంది.

డెల్మిక్రాన్ కొత్త వేరియంటా? అసలు నిజంగా ఇది ఉన్నదా? దీనిపై చర్చ ఎందుకు?

కాగా, దేశంలో Omicron Variant కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడు ఒక్కసారిగా 33 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు తేలింది. తెలంగాణలోనూ కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కేరళ, కర్ణాటకల్లోనూ కొత్త ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 300 మార్క్‌ను దాటేశాయి. కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. 

కేవలం ముంబయి మహానగరంలోనే సింగిల్ డేలో 602 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6వ తేదీ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కొత్త కేసులు రిపోర్ట్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి వార్తలు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఉన్నత అధికారులతో Review Meeting అయ్యారు.

Omicron: అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ప్రధాని, ఈసీకి అలహాబాద్ హైకోర్టు సూచనలు

ఉన్నత అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అదే అలర్ట్‌నెస్ అమలు చేయాలని ప్రధాని మోడీ సూచించారు. కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో మెదులు కోవాలని సూచనలు చేశారు. 

ముందు జాగ్రత్తగా, కేంద్రీకృతంగా, సహకారపూర్వక కేంద్ర ప్రభుత్వ వ్యూహమేఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలందరికీ ఉపకరిస్తుందని తెలిపారు. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ జాగరూకతగా, ముందు జాగ్రత్తలతో ఉండాలని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాటం ఇంకా ముగిసి పోలేదని అన్నారు. ప్రజలు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని వివరించారు.