కటక్‌: ఒడిశాలో ఘోరమైన సంఘటన జరిగింది. అర్థరాత్రి ముగ్గురు దుండగులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. భర్తను, ఇద్దరు పిల్లలను విపరీతంగా కొట్టారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు.

ఆ సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా నికిరియా ప్రాంతంలో జరిగింది. నికిరియా ప్రాంతంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు వారింటి తలుపు తట్టారు. 

తలుపులు తీయగానే సుకుంటూ లోనికి దౌర్జన్యంగా ప్రవేశించారు.  భర్త, పిల్లలపై ముగ్గురూ దాడి చేశారు. ఆ తర్వాత వారిని నిర్బంధించి మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, గాయపడిన భర్త, పిల్లలను ఆసుపత్రికి తరలించారు.