కొద్దిపాటి పరిచయాలే ప్రేమకు దారితీస్తాయి. ఆ ప్రేమ శారీరక కలయికకూ కారణమౌతాయి. అయితే... తమ వద్దకు వచ్చే రోగులతో మాత్రం డాక్టర్లు ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోవడానికి వీలులేదని భారత వైద్య మండలి(ఎంసీఐ) స్పష్టం చేసింది.

ఈ మేరకు ఎంసీఐ వెబ్ సైట్ లో మార్గదర్శకాలను జారీ చేసింది. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ మార్గాదర్శకాలను తప్పకుండా పాటించాలని ఎంసీఐ సూచించింది. వారు చెప్పిన దాని ప్రకారం.. వైద్య వృత్తిలో ఉన్నవారు పరస్పర అంగీకారం ఉన్నప్పటికీ శారీరక సంబంధాలు పెట్టుకోవద్దని. అలాంటి చర్యలు వైద్య నియమావళికే విరుద్ధమని స్పష్టం చేశారు.

వైద్యులు లైంగికంగా, సామాజికంగా రోగులతో ఏ సంబంధాలు పెట్టుకోకూడదని పేర్కొన్నారు. వైద్యులు, రోగికి మధ్య లైంగిక సంబంధం చికిత్స అ ందించే విధానంలో విపరీత మార్పులు తెస్తుందని.. అది రోగికి నష్టం కలిగిస్తుందని  చెప్పారు.

ఒకవేళ రోగి తనంతట తానే శారీరక సంబంధాన్ని కోరకున్నా.. వైద్యులు దాన్ని తిరస్కరించాలని చెప్పారు. వైద్యులు రోగికి సంబంధించి జననేంద్రియాలు పరీక్షించాల్సి వస్తే.. ఆ సమయంలో రోగితోపాటు సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

వైద్యులు తమ మాజీ రోగులతో కూడా ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని సూచించారు.