న్యూఢిల్లీ: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గురువారం నాడు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. పలువురు బీజేపీ నేతలను కలిసేందుకుగురువారం నాడు ఆయన ఢిల్లీకి చేరుకొన్నారు.  స్థానిక పరిస్థితుల కారణంగానే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆదినారాయణరెడ్డి ప్రకటించారు.

న్యూ,ఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. జగన్ దాష్టీకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. జగన్ అరాచకాలను ఎదుర్కోవాలంటే  బీజేపీ లాంటి గట్టి పార్టీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని తనకు నమ్మకం ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన అనుచరుల కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు. తాను బీజేపీలో చేరాలనే  నిర్ణయం తీసుకొన్న విషయాన్ని చంద్రబాబుకు తెలిపినట్టుగా  ఆయన చెప్పారు.

అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాలా... లేదా కడపలో బారీ బహిరంగ సభలో బీజేపీలో చేరాలా అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

బాబుకు షాక్: హస్తినకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, రేపు బీజేపీలోకి..?

టీడీపీలోనే ఉంటానని నేను చెప్పానా..? మాజీ మంత్రి ఆది

బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?

పీఛే ముడ్: ఆదినారాయణ రెడ్డి వెనక్కి, టీడీపిలోనే.