హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈనెల 12న న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకే ఆదినారాయణ రెడ్డి బుధవారం హస్తినకు బయలు దేరారని ప్రచారం జరుగుతుంది. 

గత కొద్ది రోజులుగా బీజేపీలో చేరే అంశంపై ఊగిసలాడుతున్నారు ఆదినారాయణ రెడ్డి. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిసిన ఆదినారాయణ రెడ్డి అప్పుడే బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అయితే అది కాస్త వాయిదా పడిపోవడం ఆ తర్వాత చంద్రబాబు నాయుకు వివరణ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. 

జేపీ నడ్డాను  కలవడంపై ఈనెల 3న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వివరణ ఇచ్చారు. చంద్రబాబు బుజ్జగించడంతో కాస్త వెనక్కి తగ్గారు. అనంతరం ఈనెల 7న తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పానా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  

టీడీపీలోనే కొనసాగుతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. తాను బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తనకు తన ప్రాంత అభివృద్ధి మాత్రమే ముఖ్యమని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను చంద్రబాబుతో భేటీ అయినమాట నిజమేనని అలా అని తాను టీడీపీలోనే ఉంటానని కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  పేర్కొన్నారు.

‘‘బీజేపీలో చేరడం ఖాయం. అనుచరులతో సమావేశమై తేదీ నిర్ణయించడమే మిగిలింది అంటూ కుండ బద్దలు  కొట్టారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శల నేపథ్యంలో తాను రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటానేమోనన్న ఆందోళనతో ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది.  

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీలోనే ఉంటానని నేను చెప్పానా..? మాజీ మంత్రి ఆది

బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?

పీఛే ముడ్: ఆదినారాయణ రెడ్డి వెనక్కి, టీడీపిలోనే.