17 ఏళ్ళ యువతిపై రేప్, రెండో అంతస్తు నుండి తోసివేత

Mumbai Crime: Man rapes 17-year-old girl, throws her out of window
Highlights

ముంబైలో దారుణం యువతిపై అత్యాచారం


ముంబై: 17 ఏళ్ళ యువతిపై  లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు  ఆమెను రెండో అంతస్తు పై నుండి కిందకు తోసేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.  తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ముంబైలోని  ఎంఐడీసీ ఏరియాలోని 17 ఏళ్ళ యువతి అత్త, మామలతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో  నివాసం ఉంటుంది. గురువారం నాడు సాయంత్రం పూట  పని మీద బయటకు వెళ్ళిన యువతిని అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 21 ఏళ్ళ యువకుడు  ఆ యువతిని తమ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.  చాలా సేపటి వరకు  యువతి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు.

 అయితే  యువతిపై అత్యాచారానికి పాల్పడిన  ఆ నిందితుడు  ఆమెను రెండో అంతస్తులోని తమ ఇంటి కిటికీ నుండి కిందకు తోసేశాడు.  అంతేకాదు అక్కడి నుండి అతను పారిపోయాడు.  రెండో అంతస్తు  మీద నుండి  కింద పడి ఆ యువతి తీవ్రంగా గాయపడింది. 

యువతిని యువకుడు తమ ఇంట్లోకి లాక్కెళ్ళిన విషయాన్ని చూసిన కొందరు  అపార్ట్‌మెంట్ వాసులు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసే సరికి రెండో అంతస్థు నుండి కిందపడి తీవ్ర గాయాలతో  గాయపడిన యువతిని ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

loader