Asianet News TeluguAsianet News Telugu

కేర‌ళ‌ నరబలి.. అంతా పథకం ప్రకారమే, పోర్న్ ఫిలింలో నటనకని చెప్పి...

కేరళలో జరిగిన నరబలి ఘ‌టన దేశ‌వ్యాప్తంగా  సంచలనం రేపుతోంది. ఈ కేసు విచార‌ణ‌లో పలు దిగ్భ్రాంతికర‌ విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ ద‌ర్యాప్తులో విస్తుకొలిపే విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారి మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ అని పోలీసులు వెల్లడించారు.

Mohammed Shafi was the brain behind the double murder
Author
First Published Oct 12, 2022, 3:59 PM IST

కేరళలో జరిగిన నరబలి ఘ‌టన దేశ‌వ్యాప్తంగా  సంచలనం రేపుతోంది. ఈ కేసు విచార‌ణ‌లో పలు దిగ్భ్రాంతికర‌ విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ ద‌ర్యాప్తులో విస్తుకొలిపే విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని దంప‌తుల‌ను న‌మ్మించి.. ఓ తాంత్రికుడు ప‌న్నిన ప‌న్నాగంలో ఇద్దరు మహిళలను బలయ్యారని పోలీసులు గుర్తించారు.ఈ హత్యలకు ప్రధాన సూత్రధారి మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ అని పోలీసులు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జంట హత్యల వెనుక మహ్మద్ షఫీది హ‌స్త‌ముంద‌ని తెలిపారు. ష‌ఫీ చేతబడి అభ్యాసకుడిగా నటిస్తూ..  డబ్బు వ‌స్తుంద‌ని  ఆశతో చూపించి.. అమాయ‌కుల‌తో  ఇలాంటి దారుణాల‌ను పాల్ప‌డుతాడ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే భగవల్ సింగ్ మూఢ నమ్మకాన్ని ఉపయోగించుకుని, అత‌ని వ‌ద్ద నుంచి డబ్బు లాక్కోవాలనేది మహ్మద్ షఫీ ప్ర‌ధాన ఉద్దేశం పోలీసులు తెలిపారు. ష‌ఫీ ప‌థ‌కం ప్ర‌కారమే భగవల్ సింగ్ దంప‌తుల‌కు ప‌రిచ‌య‌మై.. వారికి న‌ర‌బ‌లి చేస్తే..డబ్బు దొరుకుతుంద‌నే ఆశ చూపాడ‌ని గుర్తించారు. పోలీసు విచార‌ణ‌లో నిందితులు సంచ‌ల‌న విషయాల‌ను వెల్లండించారు.   

 ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం..
 
పథనంథిట్ట జిల్లా తిరువళ్లకు చెందిన మసాజ్ థెరపిస్ట్ భగవంత్ సింగ్, లైలా భార్యాభర్తలను టార్గెట్ చేశారు. తొలుత‌ శ్రీదేవి అనే పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి.. భగవాల్ సింగ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌ర్చుకున్నాడు. ఆ క్ర‌మంలో భ‌గ‌వాల్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ గురించి తెలుసుకున్నాడు. 
 
భగవాల్ ను ఫేస్‌బుక్‌లో నిత్యం ఫాలో అయ్యే వాడు. ఆయ‌న‌ సిపిఐ(ఎం) కార్య‌క‌ర్త‌..  కొన్ని సమయాల్లో పార్టీ   భావజాలానికి మద్దతు ఇచ్చే పోస్ట్‌లు, పోస్టర్‌లను పంచుకున్నాడు. అయినా.. ఆయ‌న‌కు నరబలి చేస్తే..  సంపద,  శ్రేయస్సు పెరుగుతుంద‌ని న‌మ్మ‌బ‌లికాడు. డ‌బ్బు వ‌చ్చిప‌డుతుంద‌ని ఆ జంటను మ‌భ్య‌పెట్టి.. వారి న‌ర‌బ‌లికి ఒప్పించాడు. బ‌లి ఇవ్వ‌డానికి త‌నే ఓ స్త్రీని తీసుకువస్తానని వారికి వాగ్దానం చేశాడు.నరబలి గురించి భగవల్ దంప‌తుల‌ను ఒప్పించిన  తర్వాత.. అమాయ‌కుల కోసం వెత‌క‌డం ప్రారంభించారు.  

జూన్‌లో మొద‌టి న‌ర‌బ‌లి

జూన్​లో బ‌లి ఇవ్వాలని నిర్ణ‌యించారు.ఈ క్ర‌మంలో  కాలాడిలో లాటరీ టిక్కెట్లు విక్రయించే  49 ఏళ్ల రోస్లిన్ టార్గెట్ చేశారు. పోర్న్ మూవీ షూటింట్ ఉంద‌ని .. అందులో పాల్గొంటే..  రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పి మహమ్మద్ షఫీ న‌మ్మించాడు. ఆమెను ఎలంతూరుకు తీసుకెళ్లి దంపతుల ఇంట్లో దారుణంగా హత్య చేశాడు.

అయితే.. న‌ర‌బ‌లి త‌రువాత‌..తగినంత ఫలితం రాలేదని ఆ జంట షఫీని ప్రశ్నించగా.. అతను మరొకరి బ‌లి చేయాల‌ని ..  వారిని ఒప్పించాడు. ఆ తర్వాత ఎలంకులంలో నివసించే పద్మ అనే మ‌హిళ‌ను మూఢ న‌మ్మ‌కాల‌తో న‌మ్మించి.. త‌మ‌కు స‌హక‌రిస్తే...ధనవంతురాలిని చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఆమెను బలితీసుకున్నాడు.

మిస్సింగ్ కేసుతో వెలుగులోకి..
 
సెప్టెంబ‌ర్ లో పద్మ కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.  విచారణలో ఆమె ఫోన్ తాంత్రికుడు మహమ్మద్ షఫీ దగ్గర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని.. త‌మ‌దైన శైలిలో  ప్రశ్నించగా.. అస‌లు విష‌యం బయటపడింది. ఈ క్ర‌మంలో భగవంత్ సింగ్, లైలా  విచారించడంతో జూన్​లో రోసెలిన్, సెప్టెంబర్​లో పద్మ అనే మహిళలను తమ ఇంట్లో గొంతు కోసి చంపిన‌ట్టు ఒప్పుకున్నారు. ఈ కేసులో చాలా కోణాలు ఉన్నాయనీ, ప్రాథమిక ఆధారాలను బట్టి వారిని నరబలి ఇచ్చినట్లు గుర్తించామ‌ని కొచ్చి పోలీసులు తెలిపారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios