ముచ్చటగా మూడో సారి మోడీయే ప్రధాని.. ఎన్డీఏ కూటమికి 378 సీట్లు - ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్

నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్’ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 378 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి  98 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

Modi is the prime minister for the third time. NDA alliance to get 378 seats - India TV-CNX opinion poll..ISR


వచ్చే లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ మచ్చటగా మూడో సారి ప్రధాని పదవిని చేపట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్’ వెల్లడించింది. మంగళవారం విడుదల చేసిన ఈ ఒపినియన్ పోల్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) 543 లోక్ సభ స్థానాలకు గాను 378 సీట్లు గెలుచుకోనుంది. 

లోక్ సభ ఎన్నికల్లో 37 సీట్లకే కాంగ్రెస్ పరిమితం - ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే అంచనా..

‘ఇండియా టీవీ-సీఎన్ఎక్స్’ సంయుక్తంగా ఫిబ్రవరి 5 నుంచి 23 వరకు మొత్తం 543 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో మొత్తం 1,62,900 మంది పాల్గొన్నారు. ఇందులో పురుషులు 84,350, స్త్రీలు 78,550 ఉన్నారు. ఈ సంస్థ అంచనాల ప్రకారం.. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి (తృణమూల్ కాంగ్రెస్ మినహా) 98 సీట్లు గెలుచుకుంటుంది. అలాగే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, ఇండిపెండెంట్లు కలిసి మిగిలిన 67 సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది. 

బీజేపీ సొంతంగానే 335 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. ఇందులో గుజరాత్ లో 26 స్థానాలు, మధ్యప్రదేశ్ లో 29, రాజస్థాన్ లో మొత్తం 25, హర్యానాలో మొత్తం 10 , ఢిల్లీలో 7 , ఉత్తరాఖండ్ లో 5, హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 4 స్థానాలను క్లీన్ స్వీప్ చేయనుందని సర్వే తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ 74, దాని మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్ డీ), అప్నాదళ్ లు మొత్తం 80 సీట్లకు గాను చెరో రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక్కడ ఉన్న రెండు సీట్లను అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి కైవసం చేసుకుందని తెలిపింది. యూపీలో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లకు ఒక్క స్థానం కూడా దక్కబోదని అంచనా వేసింది 

రైతుల ఆందోళన మళ్లీ షురూ.. నేడు ఢిల్లీ చలో మార్చ్.. సరిహద్దుల్లో పోలీసుల అలెర్ట్..

బీహార్ లో 17, జార్ఖండ్ లో 12, కర్ణాటకలో 22, మహారాష్ట్రలో 25, ఒడిశాలో 10, అసోంలో 10, పశ్చిమబెంగాల్ లో 20 స్థానాలు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని  ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకనే అవకాశం ఉందో ఆ సంస్థ అంచనా వేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ 21, తమిళనాడులో డీఎంకే 20, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ 15, టీడీపీ 10, ఒడిశాలో బీజేడీ 10 స్థానాలు కైవసం చేసుకోవచ్చని పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios