Asianet News TeluguAsianet News Telugu

సరదాగా తిరునాళ్లకు వెడితే... మైనర్ ను వివస్త్రను చేసి గ్యాంగ్ రేప్..నగ్నంగా గ్రామానికి వస్తుండగా వీడియో తీసి..

సరదా కోసం తిరునాళ్లకు వెళ్లిన ఓ బాలిక మీద కన్నేసిన యువకుడు అత్యంత పాశవికంగా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. ఆ తరువాత బాలిక నగ్నంగా ఊర్లోకి నడిచివస్తుంటే చూసిన వారు వీడియో తీశారు.

minor girl gang rapes in uttarpradesh
Author
First Published Sep 22, 2022, 9:04 AM IST

లక్నో : ఉత్తరప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కారణాలు ఏమైనా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు కలవరపెడుతున్నాయి. ఒకే రోజు ఉత్తరప్రదేశ్ లో రెండు ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ ఆందోళనలు మరింతగా వ్యక్తమవుతున్నాయి. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు ఆమె మీద అత్యాచారాల పర్వం కొనసాగిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి నలుగురు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొరాదాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పక్క గ్రామంలో తిరునాళ్లకు వెళ్ళినప్పుడు స్థానిక యువకులు ఆమెపై కన్నేసి ఈ క్రూర చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత బాలిక నగ్నంగా తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మద్యంమత్తులో క్లాస్ రూం కు వచ్చిన ప్రొఫెసర్.. అంతటితో ఆగకుండా పాటలు పాడుతూ.. మాస్ స్టెప్పులు ​.. వీడియో వైరల్​

బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులలో ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 7న తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు అడిగితే తన కూతురికి జరిగిన విషయం చెప్పలేదు అని పేర్కొన్నారు. అయినా తాము దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో ఇదే రోజు వెలుగులోకి రావడం శోఛనీయం. గర్భిణీపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయగా.. బాధితురాలికి గర్భస్రావం అయిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలిలో జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. మూడు నెలల గర్భంతో ఉన్న మహిళ ఈ నెల 13న పొలంలో పని చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు ఫలితంగా ఆమెకు గర్భస్రావం అయింది. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజే ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తన భార్య ఆరోగ్యం విషమించాక జిల్లా ఆస్పత్రిలో చేర్చి.. అక్కడినుంచి పోస్టు ద్వారా ఫిర్యాదు పంపితే.. మంగళవారం కేసు నమోదు చేశారని తెలిపాడు. అయితే ఈ నెల 16నే మహిళా పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios