Asianet News TeluguAsianet News Telugu

Omicron: జనవరి, ఫిబ్రవరిలో చిన్నపాటి థర్డ్ వేవ్.. ఆంక్షలు అవసరమే.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలోని పలురాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకూ వేగంగా ఈ వేరియంట్ సోకే ముప్పు ఉన్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది తొలినాళ్లలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం  ఉన్నదని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్, కేంద్ర ఆమోదంతో నడిచే సూత్ర మాడల్ సహవ్యవస్థాపకుడు మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే, నైట్ కర్ఫ్యూ, గుమిగూడ కుండా ఆంక్షలు నిషేధించి ఒమిక్రాన్ పీక్‌ను అదుపులోకి తేవచ్చునని పేర్కొన్నారు. కేసులు వేగంగా పెరిగే అవకాశం ఉన్నా.. వాటి తీవ్రత స్వల్పంగానే ఉంటుందని ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు తెలియజేస్తున్నాయని వివరించారు.

mild third wave in india is certain says IIT professor
Author
New Delhi, First Published Dec 5, 2021, 3:11 PM IST

న్యూఢిల్లీ: Omicron కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు కేసుల నుంచి నేడు ఐదుకు చేరాయి. ఇంకా పలు అనుమానిత కేసుల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. అత్యంత వేగంగా వ్యాపించే సామర్థ్యం కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉన్నది అనే విశ్లేషణల నేపథ్యంలో మరోసారి థర్డ్ వేవ్ గురించి ఆందోళనలు వెల్లడవుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గక మునుపే అంత కంటే వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ వేరియంట్ రావడం మరోసారా భయాలను కలుగజేస్తున్నది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు పెరిగినా.. ఆ వేరియంట్ సోకవడం వల్ల లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని, చాలా కేసుల్లో హాస్పిటల్‌కు చేరాల్సిన అవసరం కూడా లేదు అనే ఊరట ఇచ్చే కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనింద్ర అగర్వాల్ కీలక విషయాన్ని వెల్లడించారు.

మనీంద్ర అగర్వాల్ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నడుస్తున్న ‘సూత్ర’ మాడల్‌కు సహ వ్యవస్థాపకుడు. మన దేశంలో కరోనా మహమ్మారి(Corona Pandemic) విశ్వరూపం ఎలా ఉండబోతుంది? కేసులు ఎంత వరకు పెరిగిే అవకాశం ఉన్నది? అనే కీలకమైన అంచనాలను మేథమెటికల్‌గా ఈ సూత్ర మాడల్ అంచనా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాల్లో ఈ అంచనాలూ పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ కామెంట్ చేయడంతో ఆయన వ్యాఖ్యలపై చర్చ జోరుగా నడుస్తున్నది.

Also Read: Omicron: ఢిల్లీలో ఒమిక్రాన్ తొలి కేసు నమోదు, ఇండియాలో మొత్తం ఐదుకి చేరిక

ఒమిక్రాన్ కేసులు వచ్చే ఏడాది తొలినాళ్లలో పీక్‌కు చేరుతాయని అంచనా వేశారు. అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలూ జరగాల్సి ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఒమిక్రాన్ కేసులు తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నది. అసలే వేగంగా వ్యాపించే వేరియంట్ కావడం, అదే సమయంలో రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలు జరనుండటం కొత్త ఆందోళనలను ముందుకు తెచ్చాయి. ఈ రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ సహా ఆయా రాష్ట్రాల ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నాయి. ఇప్పటికే క్యాంపెయిన్‌లు ప్రారంభించడం గమనార్హం.

ఒమిక్రాన్ వల్ల వచ్చే ఏడాది తొలినాళ్లలో చిన్నపాటి థర్డ్ వేవ్(Third Wave) ఏర్పడేలా అవకాశాలు ఉన్నాయని మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. అయితే, ఆ కేసుల పీక్‌కు గురించి ఆందోళన చెందాల్సిన పని లేదనీ అన్నారు. డెల్టా వేరియంట్ విజృంభించినప్పటి పరిస్థితులు ఇంకా జ్ఞాపకం ఉన్న సంగతి తెలిసిందే. అదే తరహాలో కేసులను తగ్గించవచ్చునని ఆయన వివరించారు. అయితే, అంతటి కఠిన నిబంధనలూ అవసరం లేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, హాస్పిటల్‌ రంగంపైనా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని వివరించారు. డెల్టా వేరియంట్ సమయంలో లక్షణాలు తీవ్రంగా ఉండటంతో దేశవ్యాప్తంగా కఠోర పరిస్థితులు తాండవించాయి. హాస్పిటల్‌లలో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, మరెన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా సోకవచ్చునని, కానీ, హాస్పిటల్ రంగంపై ఒత్తిడి అత్యధికంగా ఉండకపోవచ్చునని ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.
 
ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో సాధారణ కరోనాను ఎదుర్కొనే శక్తిని ఇది అధిగమిస్తుందని, సహజ వ్యాధి నిరోధక శక్తినీ దాటివేస్తుందనే అంచనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీకాల సామర్థ్యంపైనా చర్చ జరిగింది. బూస్టర్ డోసు వేయాలనే డిమాండ్లు ముందుకు వచ్చాయి. కాగా, ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ విశ్లేషణలతో విభేదించారు.

Also Read: Covid Deaths: దేశంలో గత 24 గంటల్లో 2,796 కోవిడ్ మరణాలు.. అసలు కారణమేమిటంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరగడాన్ని చూస్తున్నామని, కానీ, తత్ఫలితంగా సంక్షోభ పరిస్థితులు మాత్రం లేవని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వివరించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ వేరియంట్ ద్వారా లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని, అయితే, వేగంగా సంక్రమిస్తుందనే విషయం తెలుస్తున్నదని తెలిపారు. మనదేశంలో థర్డ్ వేవ్ రావడం వచ్చే అవకాశాలే ఎక్కువ అని, అయితే, అది ఎంత తీవ్రంగా మారుతుందనే విషయం ప్రభుత్వం తీసుకునే కట్టడి చర్యలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. నైట్ కర్ఫ్యూ, పండుగలు, క్రతువులు, వేడుకల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఆంక్షలు విధించాలనే సూచనలను ఆయన చేశారు. తద్వార ఒమిక్రాన్ పీక్‌ను అడ్డుకోగలమని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios