Asianet News TeluguAsianet News Telugu

రెండోసారి శృంగారాని భార్య అంగీకరించలేదని.. గొంతుకు తాడు బిగించి హత్య చేసిన భర్త..

ఒకేరాత్రిలో రెండోసారి సెక్స్ కావాలని అడిగాడో భర్త.. దీనికి భార్య నిరాకరించింది. దాంతో కోపంతో ఆమెను హత్య చేశాడు. 

Man strangles wife to death for refusing sex  twice in Uttar Pradesh
Author
First Published Dec 9, 2022, 10:51 AM IST

బరేలీ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి (34) తన భార్య(30)ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. రెండోసారి సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించడంతో ఈ దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. నిందితుడు సోమవారం రాత్రి తన భార్యను నిద్ర లేపాడు. ఆ తరువాత వారిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. 

ఆ తరువాత అదే రాత్రి మరోసారి భార్యను సెక్స్ కావాలని అడిగాడు. అయితే, దీనికి ఆమె నిరాకరించింది. దీంతో తన కోరిక తీర్చమంటే ఒప్పుకోవడం లేదని అతను భార్య మీద కోపానికి వచ్చాడు. అంతే.. తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఈ మేరకు పోలీసుల ముందు వీడియో స్టేట్‌మెంట్‌లో మహ్మద్ అన్వర్ అనే ఆ నిందితుడు అంగీకరించాడు. 

రైలు పట్టాలపై కూర్చుని ప్రేమ కబుర్లు.. ట్రైన్ ఢీ కొట్టడంతో ప్రేమ జంట మృతి..

భార్యను హత్య చేసిన తరువాత మృతదేహాన్ని పాలిథిన్‌ సంచిలో వేసి ఇంటికి 50కిలోమీటర్ల దూరంలో పడేశాడు. తెల్లారి తన భార్య కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఠాకూర్‌ద్వారాలోని రతుపురా గ్రామ సమీపంలో గుర్తు తెలియని ఓ మహిళ  మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఠాకూర్‌ద్వారా పోలీస్ స్టేషన్‌లో హత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఆ తర్వాత, వారు తమ దర్యాప్తులో భాగంలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు మృతదేహానికి సంబంధించిన ఫొటోలను పంపించారు. అమ్రోహాలో దాఖలైన మిస్సింగ్ ఫిర్యాదుతో వివరాలు సరిపోలడంతో, మొరాదాబాద్ పోలీసులు మృతదేహాన్ని గుర్తించడానికి అన్వర్‌ను పిలిచారు. విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.అమ్రోహాలో నివాసం ఉంటున్న బాధితురాలు రుఖ్సర్, అన్వర్‌ లు 2013లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్వర్ తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో బేకరీని నడుపుతుండగా, అతని కుటుంబం మొదటి అంతస్తులో నివసిస్తోంది.

ఇదిలా ఉండగా, స్మార్ట్ ఫోన్ విషయంలో ఏర్పడిన గొడవ ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వై రామకృష్ణ ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను ఇలా చెప్పుకొచ్చారు… మృతురాలి పేరు శైలు. భర్త ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో రెండు నెలల క్రితం పెళ్లి అయిన తర్వాత వీరిద్దరూ హైదరాబాదుకు వచ్చారు. 

చింతల్ శ్రీ సాయి నగర్ లో కాపురం పెట్టారు. శైలు (20) ఫోన్ ఎక్కువగా వాడుతుంది. కరోనా లాక్డౌన్ సమయంలో..  అది ఆమెకు వ్యసనంగా మారింది. దీంతో తల్లిదండ్రులు వారించే వారు, పెళ్లి అయితే ఆమె అలవాటును మానుకుంటుంది అనుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉండడం, రీల్స్ చేస్తూ ఉండేది. ఇది భర్త గంగాప్రసాద్ కు నచ్చలేదు. ఫోన్ కు దూరంగా ఉండాలని పలుమార్లు నచ్చజెప్పాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. 

వారం రోజుల కిందట  ఆమె స్మార్ట్ ఫోన్ కు కొత్త పాస్వర్డ్ సెట్ చేసి.. అది ఆమె తీయకుండా లాక్ చేశాడు. బుధవారం రాత్రి తన ఫోన్ లాక్ తొలగించాలని భర్తను కోరింది. అతను ఒప్పుకోకపోవడంతో అలా చేయకపోతే తాను చచ్చిపోతానని బెదిరించింది. దీంతో భర్త భయాందోళనలకు గురి అయ్యాడు. శైలు తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వినకపోవడంతో శైలు తల్లి విజయవాడ నుంచి హైదరాబాద్కు కూతురి దగ్గరికి వచ్చేందుకు రెడీ అయ్యింది. అంతలోనే గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బిల్డింగ్ మీద నుంచి దూకి శైలు ఆత్మహత్య చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios