డ్రగ్స్ మత్తు.. భోజనం పెట్టిన స్నేహితుడి భార్య, కూతురిపై కత్తితో దాడి..తానూ పొడుచుకుని...
డ్రగ్స్ మత్తులో స్నేహితుడి భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఆ తరువాత తానూ పొడుచుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

ముంబై: డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి చెంబూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లోకి ప్రవేశించి స్నేహితుడి భార్య, ఆమె 15 ఏళ్ల కుమార్తెను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత బుధవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.
నెహ్రూ నగర్ పోలీసులు మృతుడు 30 ఏళ్ల రాహుల్ నిషాద్‌పై యాక్సిడెంట్ డెత్ రిపోర్టుతో పాటు 'హత్యా ప్రయత్నం' కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు, అతని పొరుగువాడైన కృష్ణకుమార్ సింగ్ స్నేహితులు. నిషాద్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. నిషాద్ ముంబైలో ఒంటరిగా ఉంటున్నందున సింగ్ భార్య సుష్మ అతనికి భోజనం అదించేంది. దీంతో నెహ్రూ నగర్‌లోని సింగ్ ఇంటికి క్రమం తప్పకుండా నిషాద్ వెడుతుండేవాడు.
బుధవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో నిషాద్.. సింగ్ ఇంటికి వచ్చాడు. వెంటనే సింగ్ కుమార్తెను కత్తితో పొడిచి, సుష్మ చేతులు, మెడపై దాడి చేశాడు. ఆ తరువాత తానూ కత్తితో పొడిచుకున్నాడు. ఘటన గురించి తెలిసి వెంటనే ఈ ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నిషాద్ పరిస్థితి విషమంగా ఉందని డిసిపి హేమ్‌రాజ్ రాజ్‌పుత్ తెలిపారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.