Asianet News TeluguAsianet News Telugu

మా పార్టీ నేతలను అరెస్ట్ చేసినా ఓకే.. సీపీ జోలికొస్తే ఊరుకోను: మమత

శారదా స్కాం దర్యాప్తు సుప్రీం పరిధిలోనిది కాదన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ నివాసంపై సీబీఐ దాడిని నిరసిస్తూ ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. 

mamata benarjee comments over sarada scam
Author
Kolkata, First Published Feb 5, 2019, 10:21 AM IST

శారదా స్కాం దర్యాప్తు సుప్రీం పరిధిలోనిది కాదన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌ నివాసంపై సీబీఐ దాడిని నిరసిస్తూ ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.

సేవ్ డెమొక్రసీ పేరుతో ఆమె చేస్తోన్న దీక్ష మూడో రోజులకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బెంగాల్‌లో సీబీఐ కాలు మోపడానికి వీలేద్దని మమత తేల్చిచెప్పారు. తమది మౌన దీక్షని, మైకుల్లో నినాదాలిచ్చి, విద్యార్ధులకు ఇబ్బంది కలిగించొద్దని ఆమె తృణమూల్ శ్రేణులకు పిలపునిచ్చారు.

శారదా కుంభకోణంలో తమ తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఒప్పుకుంటానని పోలీస్ కమిషనర్ జోలికి వస్తే ఊరుకోనని మమత కేంద్రాన్ని హెచ్చరించారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ ధర్నా స్థలి నుంచే పాలనా వ్యవహారాలను నడిపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నడిరోడ్డుపైనే రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. 
 

అప్పుడు కమ్యూనిష్టులను గడగడలాడించిన మమత.. ఇప్పుడు మోడీపై గురి..!!

చుక్కెదురు: సీబీఐ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

అమిత్‌షా పర్యటనలో టీడీపీ నిరసన: శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు

దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్డండి: మోడీకి మమత సవాల్

Follow Us:
Download App:
  • android
  • ios