Asianet News TeluguAsianet News Telugu

అమిత్‌షా పర్యటనలో టీడీపీ నిరసన: శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు

బెంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన... కోల్‌కతా పోలీస్ కమిషనర్ కార్యాలయంపై సీబీఐ దాడిని ఖండించారు.

AP CM Chandrababu naidu comments over Amit shah tour in AndhraPradesh
Author
Vijayawada, First Published Feb 4, 2019, 9:20 AM IST

బెంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన... కోల్‌కతా పోలీస్ కమిషనర్ కార్యాలయంపై సీబీఐ దాడిని ఖండించారు.

రాష్ట్రాలను చెప్పుచేతల్లో ఉంచుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, ఐక్యంగా పోరాటం చేద్దామని ముఖ్యమంత్రి విపక్షాలకు పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలో అమిత్ షా పర్యటనలో టీడీపీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలపాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. బీజేపీ అధినేత పలాస పర్యటన రాజకీయ స్వార్ధమేనన్నారు. నాన్-బీజేపీ పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి, ఇది తెలిసే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో చోరీని ఉపేక్షించమని, దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ సైకో పార్టీగా మారిందని..ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే ఆ పార్టీ సైకో ధోరణి అని చంద్రబాబు మండిపడ్డారు.  
 

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

Follow Us:
Download App:
  • android
  • ios