కోల్‌కతా పోలీస్ కమిషనర్ నివాసంపై సీబీఐ దాడిని నిరసిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం అర్థరాత్రి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా‌లపై నిప్పులు చెరిగిన ఆమె సోమవారం ఉదయం వీటిని మరింత పెంచారు.

దమ్ముంటే పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ మమత సవాల్ విసిరారు. మోడీ ఆడించినట్లు అజిత్ దోవల్ ఆడుతున్నారని.. సీబీఐని నడిపిస్తోంది అజిత్ దోవలేనని ఆమె ఆరోపించారు. నా సత్యాగ్రహం ఎన్నాళ్లైనా కొనసాగుతుందని, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌నే అరెస్ట్ చేయాలని అనుకుంటారా ఎంత ధైర్యం అంటూ మమతా ఫైరయ్యారు.  

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా

అమిత్‌షా పర్యటనలో టీడీపీ నిరసన: శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు