Asianet News TeluguAsianet News Telugu

‘సగం మంది టీనేజీ పిల్లలు అసలు పోర్న్ చూడటం తప్పే అనుకోవట్లేదు’.. పిల్లలు పోర్న్ చూడటంపై సంచలన సర్వే

కామన్ సెన్స్ మీడియా అనే ఓ ఎన్జీవో సంస్థ టీనేజీ పిల్లలు పోర్న్ చూడటంపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న 1,350 మందిలో 58 శాతం మంది యాక్సిడెంట్‌గా పోర్న్ చూసినట్టు, 44 శాతం మంది ఉద్దేశపూర్వకంగా చూసినట్టు తెలిపారు. కాగా, 67 శాతం మంది పోర్న్ చూడటాన్ని ఓకేగా పేర్కొంటున్నారు. అంటే అదేమీ తప్పు కాదనే అభిప్రాయాన్ని వివరిస్తున్నారు.
 

majority teens are not guilty of watching porn online shows a survey
Author
First Published Jan 16, 2023, 5:20 PM IST

న్యూఢిల్లీ: నేడు పిల్లలు బయట గ్రౌండ్‌లో గేమ్స్ ఆడటం కన్నా.. ఆన్‌లైన్‌లో మల్టీ ప్లేయర్ గేమ్స్ ఆడుతున్నారు. సమూహంగా పిల్లలు ఆడుకోవడం వదిలిపెట్టి.. ఎక్కువగా ఫోన్‌లకే అంకితం అవుతున్నారు. తమ పిల్లలు ఫోన్‌ వదిలిపెట్టడం లేదని ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇటీవలే చెప్పడం చాలా కామన్ అయిపోయింది. స్క్రీన్ టైమ్ పెరిగిన కారణంగా వారికి మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలు తలెత్తడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా వరకు వారు మొబైల్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తున్నారనే ఫిర్యాదే తప్పితే.. ఆ సమయం అంతా కూడా వారు ఏ కంటెంట్ పై గడుపుతున్నారనే విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితులు చాలా వరకు ఉండవు. ఇంటర్నెట్ సదుపాయం చౌక కావడం, కొన్ని మీటలు నొక్కితే చాలు అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యే ప్రమాదం సోల్ ఫోన్‌లలో ఉన్నది. అయినా.. ఈ రిస్క్‌ను పెద్దగా సీరియస్ తీసుకోరు. పిల్లలకు ఫోన్లు ఇచ్చి వదిలిపెడతారు. ఈ నేపథ్యంలోనే కామన్ సెన్స్ మీడియా అనే ఓ ఎన్జీవో సంస్థ టీనేజీ పిల్లలు పోర్న్ చూడటంపై ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి. 

గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ సర్వేయర్లు 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు 1,350 టీనేజీ పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని సర్వే రూపొందించారు. టీన్స్ అండ్ పోర్నోగ్రఫీ అనే టైటిల్‌తో రిపోర్టు విడుదల చేసింది. 

ఈ రిపోర్టు ప్రకారం, 13 ఏళ్లలోపే 50 శాతం మంది  పిల్లలు పోర్న్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. టీనేజీ పిల్లల్లో 58 శాతం (సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం అని అర్థం చేసుకోవాలి ) మంది అనుకోకుండా పోర్న్‌కు ఎక్స్‌పోజ్ అవుతున్నారు. వారు అలాంటివి చూడాలని అనుకోకున్నా.. వారి ప్రమేయం లేకుండా పోర్న్ చూశారని సర్వే తెలిపింది. కాగా, 44 శాతం మంది టీనేజీ పిల్లలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆన్‌లైన్‌లో పోర్న్ చూస్తున్నారు. ఫ్రెండ్స్‌తో మల్టీప్లేయర్ గేమ్స్ ఆన్‌లైన్‌లో ఆడుతున్నప్పుడు ఈ పోర్నోగ్రఫీ ఎక్కువ మంది పిల్లలకు పరిచయం అవుతున్నదని సర్వే పేర్కొంది.

Also Read: స్మార్ట్ ఫోన్ కోసం.. ఏకంగా తన రక్తాన్ని అమ్ముకున్న యువతి...!

నీలి చిత్రాలను ఉద్దేశపూర్వకంగా చూసేవారిలో 38 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ సోషల్ మీడియా సైట్‌ల ద్వారా చూస్తున్నారని తెలిపారు. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయినప్పటికీ ప్రపంచదేశాల్లో ఇది ఇంకా అందుబాటులో ఉన్నది.

44 శాతం మంది పిల్లలు (సర్వేలో పాల్గొన్నవారిలో) యాక్చువల్ వెబ్ సైట్‌లలో చూస్తున్నారు. కాగా, 34 శాతం మంది యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ సర్వీస్‌లను వినియోగించుకుంటున్నారు. 16 శాతం మంది టీనేజర్లు సబ్‌స్క్రిప్షన్ సైట్స్‌లో చూస్తుండగా 18 శాతం లైవ్ స్ట్రీమ్డ్ పోర్న్ ఆన్‌లైన్‌లో చూస్తున్నారు.

కాగా, ఈ రెండు గ్రూపుల నుంచి అంటే.. పోర్న్ అనుకోకుండా లేదా యాక్సిడెంటల్‌గా చూసినవారిలో, ఉద్దేశపూర్వకంగా చూసినవారిని పరిగణనలోకి తీసుకుంటే సగం శాతం మంది తాము పోర్న్ చూసినందుకు సిగ్గు పడ్డట్టు సర్వేకు తెలిపారు. కాగా, 67 శాతం మంది మాత్రం పోర్న్ చూడటాన్ని పెద్ద తప్పుగా ఏమీ తీసుకోవడం లేదని వివరించారు. అంటే.. ఇట్స్ ఓకే అనే ధోరణి కనబరిచినట్టు సర్వే తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios