ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా 1.45 నిమిషాలకు భూకంపం వచ్చింది.

అయితే ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. మరోవైపు నెలరోజుల వ్యవధిలో ఢిల్లీలో భూప్రకంపనలు రావడం ఇది మూడోసారి. ఏప్రిల్ 12న ఇప్పటికే ఒకసారి భూమి కంపించింది.

ఈశాన్య ఢిల్లీలోని ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా ఢిల్లీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము, ధూళితో పాటు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. 

Also Read:

ఐదుగురు ఎయిరిండియా పైలెట్లకు కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

ఇండియాలో 63 వేలకు చేరువలో కరోనా కేసులు: 2 వేలు దాటిన మరణాలు

ముంబైలో కుప్పకూలిన భవనం: సురక్షితంగా బయటపడిన 14 మంది