Asianet News TeluguAsianet News Telugu

ఐదుగురు ఎయిరిండియా పైలెట్లకు కరోనా: క్వారంటైన్‌కి తరలింపు

 ఎయిరిండియా సంస్థలో పైలెట్లుగా పనిచేసే ఐదుగురికి కరోనా సోకింది.  ఇప్పటికి ఎయిరిండియాకు చెందిన 77 మంది సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు చెబుతున్నారు.
 

5 Air India pilots test COVID-19 positive
Author
New Delhi, First Published May 10, 2020, 1:03 PM IST


న్యూఢిల్లీ:  ఎయిరిండియా సంస్థలో పైలెట్లుగా పనిచేసే ఐదుగురికి కరోనా సోకింది.  ఇప్పటికి ఎయిరిండియాకు చెందిన 77 మంది సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు చెబుతున్నారు.

72 గంంటల ముందు నిర్వహించే రౌటర్ ప్రీ ఫ్లైట్ పరీక్షల్లో ఐదుగురు పైలెట్లకు కరోనా సోకిందని అధికారులు గుర్తించారు.వీరంతా ముంబైకి చెందిన పైలెట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఐదుగురు పైలెట్లను హోం క్వారంటైన్ కు తరలించారు అధికారులు. పైలెట్ల కుటుంబసభ్యులకు కూడ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పైలెట్లతో సన్నిహితంగా ఉన్నవారికి కూడ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

కరోనా నేపథ్యంలో మార్చి రెండో వారం నుండి అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు.  ఆ సమయంలో విదేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వైపు దేశీయంగా పలు నగరాలను కలిపే విమాన సర్వీసులను కూడ నిలిపివేయడంతో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరో వైపు రైళ్లను కూడ ప్రభుత్వం నిలిపివేసింది.

ప్రస్తుతం వలస కూలీలను తమ స్వంత గ్రామాలకు తరలించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైళ్ల ద్వారా వలస కూలీలను తమ స్వంత గ్రామాలకు తరలిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios