ఇండియాలో 63 వేలకు చేరువలో కరోనా కేసులు: 2 వేలు దాటిన మరణాలు
భారతదేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశంలో 62 వేలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ విధ్వంసం ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 3 వేలకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదుయ్యాయి. గత 24 గంటల్లో 3,227 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 62,939కి చేరుకుంది.
భారతదేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2 వేలు దాటింది. కొత్తగా గత 24 గంటల్లో 128 మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 2019కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
కొత్తగా ఐదు నగరాల నుంచి యాభై శాతానికి పైగా కేసులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ 3 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనావైరస్ తో ఓ పోలీసు మరణించాడు.చండీగడ్ లో రెండో కరోనా వైరస్ మరణం సంభవించింది. కొత్తగా 23 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో చండీగడ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 169కి చేరుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలోని రెండు రక్షణ సంస్థలను కంటైన్మెంట్ జోన్ల కిందికి తెచ్చారు.