Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు ఆ పార్వతి శబరిమల ఆలయంలోకి వెళ్లొచ్చు

 శబరి మల ఆలయంలోకి  మహిళలు కూడ ప్రవేశించే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు  తీర్పు ఇచ్చిన నేపథ్యంలో  ఈ ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న  మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

"Everyone Can Go": Top Court On Entry Of Women In Sabarimala Temple


ఏలూరు: శబరి మల ఆలయంలోకి  మహిళలు కూడ ప్రవేశించే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు  తీర్పు ఇచ్చిన నేపథ్యంలో  ఈ ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న  మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలో ఈ ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించిన ఏపీకి చెందిన పార్వతి అనే మహిళ ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించే అవకాశం దక్కింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధం. ప్రత్యేకించి  10 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు మహిళలను ఆలయ ప్రవేశం చేయకుండా నిషేధం ఉంది.

ఈ నిషేధంపై  గతంలో  కోర్టుల్లో అనేక  కేసులు దాఖలయ్యాయి. అయితే  తాజాగా సుప్రీంకోర్టు  మహిళలు కూడ పురుషుల మాదిరిగానే  శబరిమల ఆలయంలోకి ప్రవేశించి దేవుడి దర్శనం చేసుకోవచ్చని తీర్పు చెప్పింది.

గతంలో పలుమార్లు  మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి.  గత ఏడాది నవంబర్ 19వతేదీన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పార్వతి  అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి శబరిమల  ఆలయానికి వెళ్లింది.

అయితే సన్నిధానం సమీపంలో ఆమెను పోలీసులు అడ్డుకొన్నారు. కేరళ రాష్ట్రప్రభుత్వం కూడ మహిళకు సమానహక్కులుంటాయని అఫిడవిట్  దాఖలు చేసింది. 
ఈ దేవాలయంలోకి గతంలో కొందరు మహిళలు దొంగతనంగా ప్రవేశించేందుకు  చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి.

భూమాత బ్రిగాడే నేత తృప్తి దేశాయ్ కూడ శబరిమల  ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు సాధ్యం కాలేదు. ఈ విషయమై  పలు దఫాలు కోర్టుల్లో కేసులు కూడ దాఖలయ్యాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios