Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories: రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ.. ఎస్సీ వర్గీకరణలో ముందడుగు..స్టేజీపై ప్రధాని కన్నీళ్లు

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ.. ఎస్సీ వర్గీకరణలో ముందడుగు..స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యం, లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణపై బీజేపీ ఫోకస్.. అయోధ్య రామాలయ ప్రారంభ వేళ.. కేసీఆర్‌ను ఆహ్వానం.. ఆలయంపై అభ్యంతరం లేదు.. మసీదు కూల్చడంపైనే: ఉదయనిధి స్టాలిన్ సంచలనం వంటి వార్తల సమాహారం. 

January 20 th 2024 Today Top Stories, Top 10 Telugu News, Andhra Pradesh, Telangana, Headlines KRJ
Author
First Published Jan 20, 2024, 6:16 AM IST | Last Updated Jan 20, 2024, 6:36 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ.. ఎస్సీ వర్గీకరణలో ముందడుగు..స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యం, లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణపై బీజేపీ ఫోకస్.. అయోధ్య రామాలయ ప్రారంభ వేళ.. కేసీఆర్‌ను ఆహ్వానం.. ఆలయంపై అభ్యంతరం లేదు.. మసీదు కూల్చడంపైనే: ఉదయనిధి స్టాలిన్ సంచలనం వంటి వార్తల సమాహారం.

నోట్- పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి

Today Top Stories:  అయోధ్య రామాలయ ప్రారంభ వేళ.. కేసీఆర్‌కు ఆహ్వానం..

Ram Mandir: అయోధ్యలో రాముడి పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కు ఆహ్వాన పత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ.. సౌత్‌లోనే మకాం వేశారు, కేరళ నుంచి ఆయన ప్రచారం మొదలుపెడతారని టాక్ నడుస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ బలంగా వున్న తెలంగాణపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటిన బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్రలు చేపట్టనుంది. ఈ యాత్ర ఐదు పార్లమెంట్ క్లస్టర్స్ పరిధిలో .. ప్రతిరోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కాగా.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్రంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. మొత్తం 12 మంది అధ్యక్షులను మారుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 6 మోర్చాలకు అధ్యక్షులను కూడా మార్పు చేశారు .


రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ.. రూ. 40 వేల కోట్ల ఒప్పందాలు.. 
 
Davos: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులతో కలిసి దావోస్‌లో మూడు రోజులు పర్యటించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి, పలువురు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో వారు తెలంగాణలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేశారు. తెలంగాణకు ఈ డబ్బులు పెట్టుబడుల రూపంలో వస్తాయి. తద్వార ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. భారీ మొత్తంలో ఒప్పందాలు కుదరడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎస్సీ వర్గీకరణలో ముందడుగు

ఎస్‌సీ వర్గీకరణపై  కేంద్ర ప్రభుత్వం వేగంగా  పావులు కదుపుతుంది.  గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీ మేరకు  కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఎస్‌సీ వర్గీకరణపై  కేంద్ర ప్రభుత్వం  ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణపై  కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా  నేతృత్వంలో  కమిటీ ఏర్పాటైంది.  ఈ కమిటీలో  కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల  22న ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది. 2023 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఎస్సీ వర్గీకరణపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఈ విషయమై హామీ ఇచ్చారు. 

స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్

ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర పర్యటనలో భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఎంఏవై-అర్బన్ (PMAY-Urban scheme) కింద పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుకొని కొంత సమయం తరువాత ఆయన ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యం 

Miss World pageant: భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ వేదికగా నిలుస్తోంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సిని శెట్టి ఈ సారి భారత్ లో నిర్వహించబోతున్న మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించబోతోంది. ఈ ఈవెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా 120 పైగా దేశాలు పాల్గొనున్నాయి. ఈ పోటీ ఒక నెల పాటు కొనసాగే ఈ ఈవెంట్ గ్రాండ్ ఫినాలే మార్చి 9, 2024న ముంబైలో జరుగుతుంది. 
 

మరోసారి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు  

డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అయోధ్యలోని రామ మందిరంపై గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదు కూల్చి మందిరాన్ని నిర్మించడంపైనే తమ పార్టీ ఏకీభావంతో లేదని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ ఏ మతానికి, విశ్వాసాలకు వ్యతిరేకంగా కాదనేది స్పష్టం అన్నారు. డీఎంకే ఏ మత విశ్వాసానికీ వ్యతిరేకం కాదని తన తాత ఎంకే కరుణానిధి చెప్పారని వివరించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడంపై సమస్య లేదని, కానీ, అక్కడి మసీదును కూల్చి మందిరాన్ని కట్టడంపైనే తాము విభేదిస్తున్నామని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. డీఎంకే పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
 

బిల్కిస్ బానో కేసు దోషులకు చుక్కెదురు.. 

Bilkis Bano gang rape case : బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి అదనపు సమయం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. గతంలో విధించిన గడువు ప్రకారమే జనవరి 21లోగా 11 మంది దోషులు జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ‘లైవ్ లా’ పేర్కొంది. కొన్ని బాధ్యతలు ఉన్నాయి.. వాటిని పూర్తి చేసుకుని జైలు అధికారుల ముందు లొంగిపోయేందుకు 6 నెలల సమయం కోరుతూ బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (supreme court) తోసిపుచ్చింది. ఆదివారంలోగా దోషులందరూ జైలు అధికారులకు లొంగిపోవాల్సిందే అని స్పష్టం చేసింది.

విజయవాడలో  అంబేద్కర్‌ భారీ విగ్రహావిష్కరణ 

ప్రపంచంలో  అతి ఎత్తైన  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  విగ్రహన్ని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. జాతికి అంకితం చేయనున్నారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని  పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం రూ. 404  కోట్లతో  18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో  అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు.   ఈ నెల  20వ  తేదీ నుండి అంబేద్కర్ స్మృతి వనానికి  ప్రజలను అనుమతిస్తారు.

నాలుగో టీ20లోనూ ఓడిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఘన విజయం..

NZ vs Pak 4th T20I: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లోనూ పాకిస్థాన్ పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ రిజ్వాన్ 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు.  ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ శుక్రవారం (జనవరి 19) జరిగిన నాలుగో మ్యాచ్ లోనూ 7 వికెట్లతో ఓడింది.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios