Karnataka: సీఎం.. ఇలా జరుగుతుంటాయ్: సిద్ధరామయ్యతో ప్రధాని మోడీ.. వీడియో వైరల్
కర్ణాటక రాజధాని బెంగళూరులో బోయింగ్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని మోడీ ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంలో ప్రజలు మోడీ.. మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్యను చూస్తూ మోడీ ఫన్నీ కామెంట్ చేశారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఆయన బెంగళూరులో కొత్తగా బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ క్యాంపస్‌ను రూ. 1,600 కోట్లతో 43 ఎకరాల్లో నిర్మించినట్టు కథనాలు ఉన్నాయి. బెంగళూరు శివారలో దేవనహల్లిలో హైటెక్ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ పార్క్ సమీపంలో ఈ క్యాంపస్ నిర్మించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఈ క్యాంపస్ ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరువు పెడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంతలోనే ఆ సభకు వచ్చిన వారు మోడీ.. మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేశారు. దీంతో అనివార్యంగా ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కొన్ని క్షణాలపాటు ఆపాల్సి వచ్చింది.
Also Read : Lord Ram : బాల రాముడి ముఖం రివీల్ చేశారుగా.. అయోధ్య రాముడి ఫుల్ సైజ్ ఫస్ట్ పిక్ ఇదే
మోడీ.. మోడీ.. నినాదాలు రావడంపై ఆయన ప్రధాని ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. స్టేజీపైనే ఉన్న సీఎం సిద్ధరామయ్యను మోడీ చూస్తూ.. ముఖ్యమంత్రి.. ‘ఇలా జరుగుతూ ఉంటాయి’ (ముఖ్యమంత్రిజీ ఐసా హోతా రెహతా హై) అని అన్నారు. ఈ కామెంట్‌కు సీఎం సిద్ధరామయ్య ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోయారు. కేవలం నవ్వుతూ ఉండిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.