Revanth Reddy: దావోస్‌లో మెరిసిన తెలంగాణ.. రూ. 40 వేల కోట్ల ఒప్పందాలు, గతేడాది కంటే రెట్టింపు
రేవంత్ రెడ్డి టీమ్ దావోస్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. మూడు రోజుల పర్యటనలో రూ. 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది గతేడాది కంటే ఇంచుమించు రెట్టింపు.
Davos: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులతో కలిసి దావోస్‌లో మూడు రోజులు పర్యటించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి, పలువురు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో వారు తెలంగాణలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేశారు. తెలంగాణకు ఈ డబ్బులు పెట్టుబడుల రూపంలో వస్తాయి. తద్వార ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
రూ. 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదరడంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారే రేవంత్ టీమ్ అద్భుతంగా పని చేసిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మొత్తం గతేడాది కుదిరిన ఒప్పందాల కంటే ఇంచుమించు రెట్టింపు అని ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలిసింది.
Also Read : Ayodhya: ఆలయం పై అభ్యంతరం లేదు.. మసీదు కూల్చడం పైనే : ఉదయనిధి స్టాలిన్ సంచలనం
అదానీ, గ్రూపు, జేఎస్‌డబ్ల్యూ, వెబ్ వెర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ వంటి కంపెనీల పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉన్నది.