భారత్, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌ను అంతం చేసిన భార‌త్‌పై పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి దిగింది. అయితే భార‌త ఆర్మీకి త‌గిన బుద్ధి చెప్పింది. శ‌త్రువుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింది.  

ప్ర‌పంచంలోని చాలా దేశాలు భార‌త్‌కు మ‌ద్ధ‌తుగా నిల‌వ‌గా కొన్ని దేశాలు మాత్రం పాకిస్థాన్‌కి వ‌త్తాసు ప‌లికాయి. దీంతో అలాంటి దేశాల‌పై ఇండియాకు చెందిన ట్రావెల్ కంపెనీలు గ‌ట్టి షాక్ ఇస్తున్నాయి. ఇప్ప‌టికే ఈజీమై ట్రిప్ వంటి కంపెనీలు ఆయా దేశాల‌కు బుకింగ్స్‌ను నిలిచివేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో ట్రావెల్ కంపెనీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ ixigo కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ, చైనా, అజర్‌బైజాన్ దేశాలకు తమ పోర్టల్ ద్వారా ఫ్లైట్‌లు, హోటల్ బుకింగ్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు సంస్థ తెలిపింది.

Scroll to load tweet…

ఈ నిర్ణయానికి కారణం ఇటీవల భారత్ పాక్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’. ఈ దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్‌కు మద్దతుగా అజర్‌బైజాన్ నిలిచింది. టర్కీ ఒక నేవల్ షిప్‌ను కరాచీ పోర్ట్‌కి పంపింది. అంతేకాకుండా టర్కీ నుంచి వచ్చిన కామికాజే డ్రోన్లను భారత్ సరిహద్దుల్లో లక్ష్యాలపై దాడికి ఉపయోగించింది. ఇక చైనా పాక్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 2016 నుంచి 2022 మధ్య కాలంలో పాక్‌కు చైనా 70% ఆయుధాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ixigo గ్రూప్ సీఈఓ అలోక్ బజ్‌పాయ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. "బ్లడ్ & బుకింగ్స్ కలిసి ఉండ‌వు. భారత్ విషయంలో మేం రెండుసార్లు ఆలోచించాము. టర్కీ, చైనా, అజర్‌బైజాన్ దేశాలకు బుకింగ్‌లను నిలిపివేస్తున్నాం. జైహింద్!" అని తెలిపారు.

Scroll to load tweet…

ఇప్పటికే EaseMyTrip, Cox & Kings సంస్థలు కూడా టర్కీ, అజర్‌బైజాన్ దేశాల పట్ల వ్యతిరేకంగా స్పందిస్తూ కొత్త ట్రావెల్ ప్యాకేజీలు నిలిపివేశాయి. Cox & Kings అయితే టర్కీతో పాటు ఉజ్బెకిస్తాన్ దేశాన్ని కూడా ఇందులో చేర్చింది. ఇక మరో ప్రముఖ ట్రావెల్ బ్రాండ్ Go Homestays కూడా తమ భాగస్వామ్యాన్ని Turkish Airlinesతో ముగిస్తున్నట్టు ప్రకటించింది.

"భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ వ్యవహరించడాన్ని నిరసిస్తూ Turkish Airlines‌తో మేము సంబంధాలు తెంచుకుంటున్నాం. ఇకపై మా ఇంటర్నేషనల్ ప్యాకేజీల్లో ఆ విమానాలు ఉండవు. జైహింద్!" అని సంస్థ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలకు వ్యతిరేకంగా భారత ట్రావెల్ కంపెనీలు పటిష్ఠంగా స్పందిస్తున్నాయి.