భార‌తదేశ అంత‌రిక్ష రంగంలో మ‌రో కీల‌క అడుగు ప‌డింది. త్వ‌ర‌లోనే గ‌గ‌న‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వ‌హించిన కీల‌క ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.. 

DID YOU
KNOW
?
గగనయాన్ లక్ష్యం ఏంటి.?
భారతదేశం మ‌నుషుల‌ను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యం కలిగి ఉందని నిరూపించడమే. అలాగే సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం.

భారతదేశం ప్రతిష్టాత్మకమైన గగనయాన్ మిషన్ కోసం ఐఎస్ఆర్ఓ (ISRO) కీలకమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. పారా షూట్ ఆధారిత డిసెలరేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించేందుకు ఆదివారం తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)ను నిర్వ‌హించారు.

శ్రీహ‌రికోట సమీపంలో పరీక్ష

ఇస్రో అధికారి తెలిపిన ప్రకారం ఈ ప‌రీక్ష ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీహ‌రికోట సమీపంలో జరిగింది. టెస్ట్‌లో వాస్తవ పరిస్థితుల్లో పారా షూట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. ఈ పరీక్షను ఇస్రో మాత్రమే కాకుండా భారత వైమానిక దళం, డీఆర్‌డీవో, భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ సహకారంతో నిర్వహించారు. వ్యోమ‌గాములు సుర‌క్షితం భూమిపైకి ల్యాండ్ అయ్యేందుకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.

గగనయాన్ లక్ష్యం ఏంటి.?

గగనయాన్ ప్రాజెక్ట్ ప్రధానంగా భారతదేశం మ‌నుషుల‌ను అంతరిక్షంలోకి పంపే సామర్థ్యం కలిగి ఉందని నిరూపించడమే. అలాగే సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన అంశం. దీనికి ముందు అనేక అన్‌మ్యాన్‌డ్ మిషన్లు కూడా జరగనున్నాయి. ఇవి క్రూ సేఫ్టీకి అవసరమైన సిస్టమ్స్‌ను ముందుగానే పరీక్షించేందుకు ఉపయోగపడతాయి.

Scroll to load tweet…

పారాషూట్ సిస్టమ్ ప్రాధాన్యత

అంతరిక్ష యాత్ర తర్వాత తిరిగి భూమికి వచ్చే సమయంలో క్రూ మాడ్యూల్‌ను నెమ్మదిగా భూమిపైకి దించే కీలక బాధ్యత ఈ పారా షూట్ ఆధారిత డిసెలరేషన్ సిస్టమ్‌దే. ఇది సరిగా పనిచేయకపోతే వ్యోమ‌గాముల‌ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. అందుకే ఈ పరీక్షను మొదటిసారి విజయవంతంగా పూర్తి చేయడం గగనయాన్ మిషన్ విజయానికి పునాది వేసినట్లైంది.